వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??
మయన్మార్‌లోని మొగాక్ ప్రాంతంలో 11 వేల క్యారెట్ల (2.2 కిలోలు) భారీ కెంపు లభ్యమైంది. 'కెంపుల లోయ'గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో దొరికిన ఈ కెంపు, గతంలో లభించిన వాటికంటే నాణ్యత, విలువలో మిన్నగా ఉంటుందని నిపుణుల అంచనా. దీని విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని, అంతర్జాతీయ రత్నాల మార్కెట్‌లో ఇది సంచలనం సృష్టిస్తుందని వ్యాపారులు భావిస్తున్నారు. ఇది మయన్మార్ రత్న సంపదకు మరో మైలురాయి.
రత్నాల వేటలో మయన్మార్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. మండలే నగర సమీపంలోని మొగాక్ ప్రాంతంలో ఏకంగా 11 వేల క్యారెట్ల బరువున్న భారీ కెంపు లభ్యమైంది. అంటే దీని బరువు సుమారు 2.2 కిలోలు. ఇంతటి భారీ పరిమాణంలో నాణ్యమైన కెంపు దొరకడం అత్యంత అరుదైన విషయమని ఆ దేశ అధికారులు వెల్లడించారు. మొగాక్ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా ‘కెంపుల లోయ’ అని పేరు. గతంలో కూడా ఇక్కడ 1996లో 21,450 క్యారెట్లు, 2022లో 2,789 క్యారెట్ల బరువున్న కెంపులు లభించాయి. అయితే, ప్రస్తుతం లభించిన ఈ 11 వేల క్యారెట్ల కెంపు నాణ్యత పరంగా, విలువ పరంగా మునుపటి వాటన్నింటికంటే మిన్నగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి అధికారులు దీని అధికారిక విలువను వెల్లడించనప్పటికీ, అది వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా. ఉదాహరణకు, 2015లో జరిగిన ఒక వేలంలో కేవలం 25.59 క్యారెట్ల మయన్మార్ రూబీ ఏకంగా 30.33 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 286 కోట్లు పలికింది. ఆ లెక్కన చూస్తే, ఇప్పుడు లభించిన 11 వేల క్యారెట్ల భారీ కెంపు విలువ ఊహకందనంతగా ఉంటుందని రత్నాల వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు
బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్
Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

