AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా

ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా

Phani CH
|

Updated on: May 14, 2026 | 5:46 PM

Share

ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి జర్మనీలోని రూట్‌లింగెన్‌లో ఉంది. 'స్ప్రూయర్‌హాఫ్‌స్ట్రాస్సే' పేరుతో గిన్నిస్ రికార్డుల్లో నిలిచిన ఈ వీధి అత్యంత ఇరుకైన చోట కేవలం 31 సెం.మీ. వెడల్పు ఉంటుంది. 1726 అగ్నిప్రమాదం తర్వాత ఏర్పడిన ఇది, పర్యాటకులకు ఆకర్షణగా మారింది. నడవడానికి కష్టమైనా, దీనిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి వస్తుంటారు.

ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధిని చూసారా? అది ఎంత చిన్నదంటే.. చూడ్డానికి రెండు భవనాల మధ్య ఉన్న సందులా కనిపిస్తుంది. అయినా సరే, దానికి అధికారికంగా ‘వీధి’ అనే గుర్తింపు ఉంది. దాని ప్రత్యేకత కారణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. టూరిస్ట్‌లను కూడా ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధిగా గిన్నిస్ బుక్‌లో నమోదైన ప్రదేశం ‘స్ప్రూయర్‌హాఫ్‌స్ట్రాస్సే’. ఇది జర్మనీలోని రూట్‌లింగెన్ అనే చారిత్రక నగరంలో ఉంది. ఈ వీధి అత్యంత ఇరుగ్గా ఉండే చోట కేవలం 31 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కాస్త వెడల్పుగా ఉన్న చోట కూడా దీని కొలత 50 సెంటీమీటర్లు మించదు. దాంతో ఈ వీధిలో ఒకేసారి ఒక్కరు మాత్రమే నడవగలరు. అది కూడా నిటారుగా నడవడం సాధ్యం కాదు, పక్కకు తిరిగి నెమ్మదిగా వెళ్లాలి. కాస్త లావుగా ఉన్నవారు, పెద్ద బ్యాగులు భుజాన వేసుకున్నవారు ఇందులోంచి వెళ్లడం దాదాపు అసాధ్యం. అది చూడటానికి సందులా ఉన్నప్పటికీ, దీనిని అధికారికంగా పబ్లిక్ వీధిగానే గుర్తించారు. ఈ వీధి ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉంది. దీని చరిత్ర 18వ శతాబ్దానికి చెందినది. 1726లో రూట్‌లింగెన్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి, నగరం చాలా వరకు నాశనమైంది. ఆ తర్వాత నగరాన్ని పునర్నిర్మించే క్రమంలో, రెండు భవనాల మధ్య అనుకోకుండా ఆ చిన్న ఖాళీ ఏర్పడింది. కాలక్రమేణా ఆ సందుకే వీధిగా గుర్తింపు లభించింది. అధికారికంగా 1820లో దీనిని వీధి నంబర్ 77గా నమోదు చేశారు. ఆ ఇరుకైన నిర్మాణం వల్ల ఆధునిక కాలంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. భవనాల నిర్వహణ, ఆస్తుల హక్కుల విషయంలో పక్కపక్కనే ఉన్న భవనాల యజమానుల మధ్య కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీధిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్ట్‌లు వస్తుంటారు. ఈ వీధి గుండా నడవగలమా లేదా అని పరీక్షించుకోవడానికి, దాని ఇరుకైన రూపాన్ని ఫొటోలలో బంధించడానికి టూరిస్టులు ఆసక్తి చూపిస్తుంటారు. స్థానిక గైడెడ్ వాకింగ్ టూర్లలో కూడా ఈ వీధిని ఒక ముఖ్యమైన ప్రదేశంగా చేర్చారు. దీంతో పర్యాటకులు సులభంగా దీనిని సందర్శించగలుగుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి ఇరుకైన వీధులు మరికొన్ని ఉన్నప్పటికీ, గిన్నిస్ రికార్డ్ హోల్డర్‌గా ఈ వీధి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇంగ్లండ్‌లోని ఎక్సెటర్‌లో ఉన్న పార్లమెంట్ స్ట్రీట్ , రొమేనియాలోని బ్రాసోవ్‌లో ఉన్న స్ట్రాడా స్ఫోరీ వంటివి కూడా ఇరుకైన వీధులుగా పేరు పొందాయి. ఏది ఏమైనా, ఒక చిన్న సందు కూడా దానికంటూ ఒక కథను, ప్రత్యేకతను సొంతం చేసుకుని ప్రపంచ ప్రసిద్ధి చెందగలదని ఈ జర్మన్ వీధి నిరూపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయ్‌ CM అయిన వేళ..త్రిషకు రూ. 12 కోట్ల జాక్ పాట్

TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే

Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్

Trisha Tattoo: త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్‌కు సంబంధం ఏంటి ??

Trisha: ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే..’ అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!

Follow Us