AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: 'ప్రేమ ఎప్పుడూ గొప్పదే..' అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!

Trisha: ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే..’ అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!

Phani CH
|

Updated on: May 12, 2026 | 11:46 AM

Share

విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు రాహుల్ గాంధీ, త్రిష హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష, విజయ్ ప్రమాణ స్వీకారం సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత తన పట్టుచీర గురించి 'ప్రేమ ఎప్పుడూ గొప్పదే' అంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది, అది చీర గురించా లేక విజయ్ గురించా అనే చర్చకు దారితీసింది.

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా హీరో విజయ్ మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా జరిగిన ఈ వేడుకకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. అలాగే విజయ్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరితో పాటు స్టార్ హీరోయిన్ త్రిష ఈ వేడుకకు వచ్చింది. లేత నీలి రంగు కాంజీవరం పట్టుచీర, లేత బంగారు రంగు డిజైనర్ బ్లౌజ్‌, కొప్పున మల్లెపూలు పెట్టుకుని సంప్రదాయ తమిళ యువతిలా ముస్తాబై విజయ్ ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చిన త్రిష.. నాటి కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ త్రిష ఎమోషనల్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది త్రిష. ఇప్పుడది వైరల్ గా మారింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పట్టుచీర కట్టుకొచ్చిన త్రిష.. ఈ చీరని ఎంతో ప్రేమతో డిజైన్ చేశారని ఈ పోస్టులో చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలని షేర్ చేసి ‘ప్రేమ ఎ‍ప్పుడూ గొప్పదే’ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ చీర గురించి పెట్టిందా.. లేక విజయ్‌ గురించి పెట్టిందా? అనే డౌట్ అందరిలో కలుగుతోంది. అయితే ఈ చీరలో త్రిష ఎంతో అందంగా కనిపించింది. లైట్ బ్లూ కలర్ పట్టు చీర, కొప్పులో మల్లెపూలు, ముఖంపై చిరునవ్వుతో త్రిష చాలా గ్లామరస్ గా ఉందని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష పోస్ట్, ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Thalapathy Vijay: సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా ??

CM Vijay: అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు

RK Roja: నా చిన్నారి అన్షు.. ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగింది !! రోజా ఎమోషనల్..

Ashu Reddy: నీ మరణ వార్తను నమ్మలేకపోతున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి

Bharat Kanth: అతివేగం.. హీరో అవ్వాల్సిన వాడిని చిదిమేసింది

Follow Us