AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Kanth: అతివేగం.. హీరో అవ్వాల్సిన వాడిని చిదిమేసింది

Bharat Kanth: అతివేగం.. హీరో అవ్వాల్సిన వాడిని చిదిమేసింది

Phani CH
|

Updated on: May 12, 2026 | 11:14 AM

Share

టాలీవుడ్ యువ నటుడు భరత్ కాంత్ మే 10న రంగారెడ్డి జిల్లా, బొంగుళూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అతివేగంతో కారు కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఆయన, స్నేహితుడు త్రిలోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ విషాదం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

వేగం థ్రిల్‌ను ఇస్తుందేమో.. కానీ ప్రాణాలకు గ్యారెంటీ మాత్రం ఇవ్వదు. ఇదే విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు పదే పదే చెబుతున్నా కూడా.. అవేం పట్టనట్టుగా కొందరు అతివేగంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ప్రమాదాల భారిన పడుతున్నారు. టాలీవుడ్ యంగ్ అండ్ అప్‌ కమింగ్ హీరో భరత్ కాంత్ కూడా అతివేగం కారణంగానే చనిపోవడం.. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో షాకింగ్ గా మారింది. మే10 తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో.. భరత్‌ కార్‌కు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం పరిధిలోని బొంగుళూరు ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.భరత్ కాంత్ తన స్నేహితుడు, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్‌తో కలిసి నెల్లూరు నుండి హైదరాబాద్‌కు కారులో వస్తుండగా, వీరి కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఒక కంటైనర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ఉన్న భరత్ కాంత్, త్రిలోక్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భరత్‌ ఇటీవల టెనెంట్ సినిమాలో.. కీ రోల్ చేశాడు. ఈ రోల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. తన లుక్స్‌ తో.. యాక్టింగ్‌ తో అప్‌ కమింగ్ హీరో అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు.అంతకు ముందు 2021వో వచ్చిన గ్రామం సినిమాలోనూ.. భరత్ కాంత్ ప్రధాన పాత్ర పోషించాడు. సినిమాల్లోనే కాకుండా… గీతాంజలి, పార్వతీ పరమేశ్వరులు వంటి పాపులర్ వెబ్ సిరీసుల్లో కూడా భరత్‌ నటించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా

Siri Hanumanth: ఇన్‌స్టా సబ్‌ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!

Peddi: బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!

త్రిష పక్కనుంటే ఇక అంతే.. విజయ్‌ భవిష్యత్తు పై జోస్యం చెప్పిన వేణు స్వామి

Follow Us