Trisha: విజయ్ మౌనం నాకు నచ్చదు..!
తమిళనాట విజయ్ రాజకీయ ప్రవేశం, టీవీకే ఘన విజయంపై రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో విజయ్ మౌనంపై చర్చ జరుగుతోంది. ఆయనతో కలిసి నటించిన త్రిష గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. త్రిష ప్రకారం, విజయ్ 'సైలెంట్ కిల్లర్' అని, ఆయన మౌనంగానే అందరినీ ఆకర్షిస్తాడని అన్నారు. విజయ్ తనకు 'హోమ్' లాంటి వ్యక్తి అని, ఆయనతో ఉంటే సేఫ్టీగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ మౌనం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలపై ఆసక్తి నెలకొంది.
ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ఘన విజయాన్ని సాధించారు నటుడు విజయ్. తమిళ ప్రజలు టీవీకే పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సమస్యలొస్తున్నాయి. విజయ్ మౌనంగా ఉండటం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఆయనతో కలిసి 5 సినిమాల్లో నటించిన త్రిష గతంలో విజయ్ మౌనంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ అందరి దృష్టిని ఆకర్షిస్తాడనీ ఒక్క మాటలో చెప్పాలంటే ‘సైలెంట్ కిల్లర్’ అనీ త్రిష ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విజయ్ ఏమీ చెప్పకుండానే ఆయన్ని అందరూ ఇష్టపడతారనీ ‘గిల్లి’ సినిమా సమయంలో తమ ఇద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉండేది కాదనీ త్రిష తెలిపారు. దర్శకుడు ధరణి, టీమ్ వల్ల తాము మంచి స్నేహితులమయ్యామనీ అన్నారు. విజయ్ చాలా మంచి వ్యక్తి అనీ ఎప్పుడూ సహనంతో ఉంటాడనీ తన జీవితంలో తను ఎప్పుడూ ఇష్టపడే వ్యక్తుల్లో విజయ్ ఒకరని కామెంట్ చేసారు. సెట్‌లో ఉన్నప్పుడు విజయ్ అందరితో మాట్లాడకుండా ఓ మూల కూర్చొని గంటల తరబడి గోడ వైపు చూస్తూ ఉంటాడనీ తనకు ఆ మౌనం నచ్చదనీ చెప్పారు. తన దృష్టిలో హోమ్ అంటే ఇల్లు మాత్రమే కాదు ఓ వ్యక్తి అనీ తనకు అలాంటి వ్యక్తి విజయ్ అనీ అతడితో ఉంటే తనకు చాలా సేఫ్టీగా అనిపిస్తుందనీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ సంక్షోభం నడుస్తున్న తరుణంలో.. త్రిష అన్నట్లుగానే తన ‘మౌనం’తోనే విజయ్ ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నారో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్రిష పక్కనుంటే ఇక అంతే.. విజయ్ భవిష్యత్తు పై జోస్యం చెప్పిన వేణు స్వామి
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

