త్రిష పక్కనుంటే ఇక అంతే.. విజయ్ భవిష్యత్తు పై జోస్యం చెప్పిన వేణు స్వామి
వేణు స్వామి తాజాగా విజయ్-త్రిష జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిష పక్కన ఉంటే విజయ్ సీఎం కావడం కష్టమని జోస్యం చెప్పారు. ఒకవేళ సీఎం అయినా ఏడాదిలో మళ్ళీ ఎన్నికలు తప్పవన్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం నుండి త్రిష పేరు వివాదాల్లో చిక్కుకుంది, భార్య విడాకుల పిటిషన్ తో ఎఫైర్ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఓ పక్క తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారిన వేళ.. మన వేణు స్వామి సీన్ లోకి రావడం.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ.. నెట్టింట ట్రోలర్స్‌కు టార్గెట్ గా మారే ఈయన.. ప్రస్తుతం విజయ్- త్రిష జాతకం పై కూడా కామెంట్స్ చేశారు. త్రిష పక్కనే ఉంటే.. సీఎం గా విజయ్ తమిళనాడును పరిపాలించడం కష్టమన్నట్టుగా జోస్యం చెప్పారు. విజయ్, త్రిష.. తమిళనాడు రాజకీయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ తాజాగా ఓ వీడియో షేర్ చేశారు వేణు స్వామి. త్రిష లేకుండా ఉండి ఉంటే విజయ్ జాతకం మరోలా ఉండేదని అన్నారు వేణుస్వామి. విజయ్ సీఎం అయినా కూడా నెల లేదా దాదాపు ఆరు నెలలు, కాదంటే ఏడాది తర్వాత మళ్లీ తమిళనాడులో ఎన్నికలు వచ్చే అవకాశం నూటికి వెయ్యి శాతం ఉందంటూ కుండబద్దలు కొట్టారు వేణుస్వామి. గురు మార్పు వల్ల తమిళనాడులో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అటు బెంగాల్ లోనూ రాష్ట్రపతి పాలన వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు వేణుస్వామి. మరోవైపు, విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి త్రిష పేరు వార్తలలో మారుమోగుతోంది. ముఖ్యంగా విజయ్ సతీమణి విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం.. తన భర్తకు మరో నటితో ఎఫైర్ ఉందంటూ ఆమె విడాకుల పిటిషన్ లో తెలియజేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో త్రిష విజయ్ నివాసానికి వెళ్లడం, సోషల్ మీడియాలో ఆమె పెట్టిన కొన్ని పోస్టులు చర్చలకు మరింత బలం చేకూర్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

