Peddi: బాబాయ్ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్
జూన్ 5న విడుదల కానున్న రామ్‌చరణ్ 'పెద్ది' చిత్రం నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్‌లలో చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ 'ఓజీ' సహా ఇతర భారీ చిత్రాల 24 గంటల వసూళ్లను కేవలం 4 గంటల్లోనే అధిగమించి, బాక్సాఫీస్ వద్ద పెద్ది తన సత్తా చాటింది. ఈ సంచలనంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
జూన్ 5న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పెద్దిగా మన ముందుకు రాబోతున్నాడు. ఇందుకోసం ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో పహిల్వాన్‌గా.. బాక్సాఫీస్ దగ్గర చేయబోయే సంచలనాన్ని ముందుగానే తలుచుకుంటూ మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ది… బాబాయ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిందనే వార్త బయటికి రావడంతో.. నెట్టింట సంబరాలు మొదలెట్టారు. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ… ఓజీ. ఇప్పుడీ మూవీ రికార్డ్‌ను పెద్ది సినిమా బ్రేక్ చేసింది. నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఇప్పటివరకు ఉన్న టాప్ రికార్డులను పెద్ది దాటేసింది. గతంలో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ, ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ సలార్ వంటి భారీ చిత్రాలు మొదటి 24 గంటల్లో సాధించిన వసూళ్లను, పెద్ది కేవలం 4 గంటల్లోనే అధిగమించడం విశేషం. నార్త్ అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ ఈ మూవీని గ్రాండ్ గా విడుదల చేస్తోంది. దాదాపు 950కి పైగా ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: విజయ్ మౌనం నాకు నచ్చదు..!
త్రిష పక్కనుంటే ఇక అంతే.. విజయ్ భవిష్యత్తు పై జోస్యం చెప్పిన వేణు స్వామి
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

