AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashu Reddy: నీ మరణ వార్తను నమ్మలేకపోతున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి

Ashu Reddy: నీ మరణ వార్తను నమ్మలేకపోతున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి

Phani CH
|

Updated on: May 12, 2026 | 11:15 AM

Share

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి తన ప్రాణ స్నేహితుడు, నటుడు భరత్ కాంత్ అకాల మరణంపై తీవ్ర భావోద్వేగ పోస్ట్ చేసింది. రోడ్డు ప్రమాదంలో యంగ్ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్‌తో కలిసి భరత్ మరణించారు. 'టెనెంట్' హీరో మరణాన్ని జీర్ణించుకోలేక, పాత ఫోటోలు పంచుకుంటూ అషురెడ్డి తన గుండెల్లో నువ్వు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటన టాలీవుడ్‌లో విషాదం నింపింది.

బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటి అషురెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె ప్రాణ స్నేహితుడు, నటుడు భరత్ కాంత్ అకాల మరణం చెందారు. ఈ విషయాన్ని అషురెడ్డి స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుడిని కోల్పోవడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపింది. తనతో కలిసున్న ఫోటోలను పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది. ‘నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. నా గుండెల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావ్’ అని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. భరత్ కాంత్ మరణ వార్త తెలుసుకున్న అషురెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ‘నీ మరణ వార్తను నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాను. మనం కలిసి గడిపిన క్షణాలు, నువ్వు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. ఎప్పటికీ మా గుండెల్లో జీవించే ఉంటావు’ అంటూ తన బాధను వ్యక్తపరిచారు. భరత్‌తో దిగిన కొన్ని పాత ఫోటోలను, వీడియోలను కూడా ఆమె నెటిజన్లతో పంచుకున్నారు. భరత్ మరణం పట్ల సోషల్ మీడియాలో పలువురు నటీనటులు సైతం ఎమోషనల్ అయ్యారు. భరత్ కాంత్.. వర్ధమాన నటుడు భరత్ కాంత్, యంగ్ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగు రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్త సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకేసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. భరత్ కాంత్ ‘టెనెంట్’ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు వెబ్ సిరీస్‌లలో కూడా కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న ఈ ఇద్దరు, రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bharat Kanth: అతివేగం.. హీరో అవ్వాల్సిన వాడిని చిదిమేసింది

Follow Us