AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ప్రైవేట్ చాట్ లీక్? పంజాబ్ కోచ్‎కు ప్రీతి జింటా క్లాస్.. పంజాబ్ డగౌట్‌లో టెన్షన్ టెన్షన్ ?

IPL 2026 : ఐపీఎల్ 2026లో ముంబై చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమి తర్వాత ప్రీతి జింటా, కోచ్ రికీ పాంటింగ్ మధ్య జరిగిన తీవ్ర చర్చ చర్చనీయాంశమైంది. వరుస ఓటములతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గాలిలో దీపంలా మారాయి.

IPL 2026 : ప్రైవేట్ చాట్ లీక్? పంజాబ్ కోచ్‎కు ప్రీతి జింటా క్లాస్.. పంజాబ్ డగౌట్‌లో టెన్షన్ టెన్షన్ ?
Ipl 2026 Preity Zinta
Rakesh
|

Updated on: May 15, 2026 | 10:15 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు ఆశలు ఆవిరవుతున్నాయి. వరుసగా ఐదో ఓటమిని చవిచూడటంతో పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తీవ్ర అసహనానికి లోనయ్యారు. మ్యాచ్ ముగిసిన వెంటనే డగౌట్‌లో కోచ్ రికీ పాంటింగ్‌తో ఆమె సుదీర్ఘంగా, కాస్త సీరియస్‌గా చర్చించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఏం జరిగిందంటే?

ముంబైతో జరిగిన పోరాటంలో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (57) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, బౌలింగ్‌లో మాత్రం పంజాబ్ చేతులెత్తేసింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ (75 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్‌కు విజయాన్ని దూరం చేశాడు. ఈ ఓటమి తర్వాత ప్రీతి జింటా, పాంటింగ్ మధ్య జరిగిన టెన్షన్ చాట్ తాలూకు ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. జట్టు ఎంపిక లేదా బౌలింగ్ వ్యూహాలపై ఆమె కోచ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ అవుట్?

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతరుల గెలుపోటములపై ఆధారపడి ఉన్నాయి. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా రన్ రేట్, ఇతర జట్ల ఫలితాలు పంజాబ్‌కు కీలకం కానున్నాయి. ఇన్ని అవకాశాలు ఉండి కూడా కీలక సమయంలో పంజాబ్ తడబడటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

ముంబై ‘తిలక్’ విధ్వంసం

201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ర్యాన్ రికెల్టన్ (48) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. రోహిత్ శర్మ 25 పరుగుల వద్ద తడబడినా, తిలక్ వర్మ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. పంజాబ్ బౌలర్లు మార్కో జాన్సెన్, అజమతుల్లా ఓమర్జాయ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేసినా, మిగిలిన వారి నుంచి సహకారం అందకపోవడంతో పంజాబ్‌కు పరాభవం తప్పలేదు. ఈ ఓటమితో పంజాబ్ డగౌట్‌లో నిశ్శబ్దం అలుముకుంది.

Follow Us