AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అబద్దమే..శారద చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రం నిజం !! దీంతో ఆమెకు రూ.574 కోట్ల ఆదాయం

Phani CH
|

Updated on: May 14, 2026 | 8:35 PM

Share

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ సోషల్ మీడియాలో జరిగిన వైరల్ ప్రచారం తర్వాత ఇప్పుడు సీనియర్ నటి శారద చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి చర్చ మొదలైంది. అయితే రాజశేఖర్ విషయంలో వచ్చిన వార్తలు ఫేక్ కాగా... శారదకు నిజంగానే ‘లోటస్ చాక్లెట్స్’ అనే సంస్థ ఉంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం భారీ వృద్ధితో ముందుకెళ్తోంది. రిలయన్స్ సంస్థ మెజారిటీ వాటా దక్కించుకోవడంతో ఈ కంపెనీ మరింత వార్తల్లో నిలిచింది.

ఈ మధ్యన రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ గురించి నెట్టింట కొందరు రచ్చ రచ్చ చేశారు. ఆయనకు లేని గోటీల ఫ్యాక్టరీని ఆయనదే అంటూ.. తెగ ప్రచారం చేశారు. రాజశేఖర్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఆయనకు ఎక్కడలేని ప్రచారమూ కల్పించారు. చివరకు రాజశేఖరే తనకు గోటీల ఫ్యాక్టరీ లేదంటూనే… ఈ తప్పుడు ప్రచారంతో తనకు వచ్చిన పబ్లిసిటీ చూస్తే ముచ్చటేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సీనియర్ నటి శారదకు చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈమెను కూడా రాజశేఖర్ లా ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ ఎంత అబద్దమో.. సీనియర్ నటి శారద చాక్లెట్ ఫ్యాక్టరీ అంత నిజం. సీనియర్ నటి శారద లోటస్ చాక్లెట్స్ అనే చాక్లెట్ల ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు.1988లో హైదరాబాద్‌లో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని ఆమె స్థాపించింది. ఈ కంపెనీ చాక్లెట్లు, కోకో వెన్న, కోకో పౌడర్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. ముఖ్యంగా బల్క్ చాక్లెట్లు, పారిశ్రామిక అవసరాలకు కావలసిన చాక్లెట్ బేస్ పదార్థాలను సరఫరా చేయడంలో ఈ చాక్లెట్ కంపెనీ ప్రసిద్ధి పొందింది. సీనియర్ హీరోయిన్ శారద.. చాలా కాలం పాటు ఈ సంస్థకు ప్రమోటర్‌గా వ్యవహరించినప్పటికీ… ప్రస్తుతం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చేతిలో… లోటస్ చాక్లెట్ కంపెకనీ.. మెజారిటీ వాటాను ఉంది. అంతేకాదు ప్రస్తుతం ఈ కంపెనీ కార్యకలాపాలను కూడా రిలయన్సే నిర్వహిస్తోంది. ఇక అకార్డింగ్ టూ రిపోర్ట్స్.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో శారద లోటస్ చాక్లెట్ కంపెనీ ఆదాయం భారీగా పెరిగి 574.56 కోట్లకు చేరుకుంది. అదే.. నికర లాభం 17.23 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 185% వృద్ధి సాధించిందని రిపోర్ట్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Vijay: 0277′ విజయ్‌ కారు నెంబర్ వెనుక గుండెలు పిండేసే కథ

స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త

Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??

రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు

Published on: May 14, 2026 08:34 PM
Follow Us