AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇద్దరు అన్నాదమ్ముల్లు తోపు హీరోలు.. తెలుగులో పిచ్చి ఫాలోయింగ్.. అమ్మాయిలు పడిచచ్చిపోతారు..

పైన ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల్లు గుర్తున్నారా..? దక్షిణాదిలో ఇద్దరూ టాప్ హీరోస్. తెలుగు, తమిళంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: ఇద్దరు అన్నాదమ్ముల్లు తోపు హీరోలు.. తెలుగులో పిచ్చి ఫాలోయింగ్.. అమ్మాయిలు పడిచచ్చిపోతారు..
Suriya, Karthi
Rajitha Chanti
|

Updated on: May 15, 2026 | 9:55 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఒక ఫోటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఇద్దరు కృష్ణులు ఎవరో తెలుసా.. ? సౌత్ ఇండస్ట్రీలో వీరిద్దరికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల కలల రాజకూమారులు. తెలుగు, తమిళంలో బ్లా్క్ బస్టర్ హిట్ చిత్రాలతో తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ ఈ ఇద్దరు హీరోల క్రేజ్ చూస్తే మతిపోతుంది. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.. ? ఆ ఇద్దరు మరెవరో కాదండి.. కోలీవుడ్ స్టార్స్ సూర్య, కార్తీ. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇద్దరూ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వీరి తండ్రి శివకుమార్ తమిళంలో పాపులర్ నటుడు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

‘నడిగిప్పిన్ నాయక్’గా ప్రసిద్ధి చెందిన సూర్య అసలు పేరు శరవణన్ సూర్య శివకుమార్. ‘నెర్కు నెర్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సూర్య, 2001లో బాల దర్శకత్వంలో వచ్చిన ‘నంద’ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. తెలుగులో గజిని సినిమాతో పాపులర్ అయ్యాడు. తమిళంలో సూర్య నటించిన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా భారీ విజయాన్ని సాధించాయి. అందుకే సూర్యకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూర్య తమిళంలో తోపు నటుడిగా ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఇక అన్న బాటలోనే కార్తి సైతం సినీరంగంలోకి హీరోగా తెరంగేట్రం చేశారు. 2007లో అత్యంత విజయవంతమైన ‘పరుత్తి వీరన్’ చిత్రంతో నటుడిగా అడుగుపెట్టిన కార్తీ.. ‘ఐరతిల్ ఒరువన్’, ‘పయ్యా’, ‘నాన్ మహాన్ అల్లా’, సిరుత్తి చిత్రాలతో స్టార్ డమ్ అందుకున్నారు. తెలుగులో ఆవారా మూవీతో పాపులర్ అయిన కార్తీ.. ఊపిరి మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య కరుప్పు సినిమాతో అడియన్స్ ముందుకు వస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us