AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో SIR.. ఎప్పటినుంచో తెలుసా..?

కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఫేజ్-3ను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టనుంది. చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జూన్ నుంచి ప్రారంభం కానుంది.

బిగ్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో SIR.. ఎప్పటినుంచో తెలుసా..?
Sir
Gopikrishna Meka
| Edited By: |

Updated on: May 14, 2026 | 8:28 PM

Share

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఫేజ్-3ను ప్రకటించింది. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దశలవారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరపనుంది. ఏపీ,తెలంగాణ సహా 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ దశలవారీగా జరగనుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను తదుపరి ఫేజ్ లో SIR ప్రక్రియ జరగనుంది. జనగణన, గృహ జాబితా ప్రక్రియలతో కలిపి ఈ SIR ఫేజ్-3ను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో మాత్రం జనగణన రెండవ దశ పూర్తయిన తర్వాత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విడిగా షెడ్యూల్ ప్రకటించనున్నారు. SIR ఫేజ్ 3 లో భాగంగా మొత్తం 36.73 కోట్ల ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. 3.94 లక్షలకు పైగా బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇందుకోసం పని చేయనున్నారు. రాజకీయ పార్టీలు నియమించే 3.42 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) BLOలకు సహాయం చేయనున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక్కో BLAని నియమించాలని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరింది. పూర్తి పారదర్శకత, రాజకీయ పార్టీల పూర్తి భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇప్పటికే మొదటి రెండు దశల్లో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR ప్రక్రియ పూర్తి చేశారు.

ఏపీ తెలంగాణ SIR షెడ్యూల్ ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 15 నుంచి సెప్టెంబర్ 22 వరకు SIR ప్రక్రియ జరగనుంది. తెలంగాణలో జూన్ 25 నుంచి అక్టోబర్ 1 వరకు SIR ప్రక్రియ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మే 12 నాటికి 4,16,16,061 మంది ఓటర్లు ఉన్నారు. SIR ప్రక్రియలో 46,397 మంది BLOలు, 68,868 మంది BLAలు పాల్గొననున్నారు.

ఇక తెలంగాణలో (మే 12 నాటికి) 3,39,20,705 మంది ఓటర్లు ఉన్నారు. SIR ప్రక్రియలో 35,985 మంది BLOలు, 25,886 మంది BLAలు పాల్గొననున్నారు. ఈ ప్రక్రియలో చనిపోయినవారు, డూప్లికేట్ ఓటర్లు, మారిన చిరునామాలు తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను జోడించడం వంటి పనులు జరుగుతాయి. ఓటర్లు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని తనిఖీ చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.

మరణించిన, శాశ్వతంగా మారిన, నకిలీ, పౌరులు కాని ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా భారతదేశం అంతటా ఓటర్ల జాబితాలు ఖచ్చితమైనవని నిర్ధారించడం లక్ష్యంగా ఎన్నికల సంఘం SIR ప్రక్రియను నిర్వహిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us