AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగ్జిబిటర్లు Vs ప్రొడ్యూసర్స్.. ఇక సమరమే

ఎగ్జిబిటర్లు Vs ప్రొడ్యూసర్స్.. ఇక సమరమే

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 14, 2026 | 8:36 PM

Share

టాలీవుడ్‌లో సింగిల్ స్క్రీన్స్ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. పర్సెంటేజ్ ఇస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామంటూ ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా, నిర్మాతలు మాత్రం దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. థియేటర్ల నిర్వహణ బాధ్యతలను నిర్మాతలపై మోపడం సరికాదని మైత్రి రవిశంకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు సునీల్ నారంగ్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రగడ ‘పెద్ది’ సినిమా విడుదలపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్‌లో థియేటర్ల సమరం తారాస్థాయికి చేరిందా..? సింగిల్ స్క్రీన్స్ రగడలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు..? పర్సెంటేజ్ ఇస్తేనే సినిమాలు వేస్తామంటున్న ఎగ్జిబిటర్ల డిమాండ్‌తో అసలు ఈ వివాదం ఎటు దారి తీయబోతోంది..? నిర్మాతలు ఏమంటున్నారు.. థియేటర్ యాజమాన్యాల డిమాండ్స్‌కు తలొగ్గుతారా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ పర్సెంటేజ్ ఇష్యూ రోజురోజుకీ మరింత ముదురుతుంది. హైదరాబాద్‌లోని 22 సింగిల్ స్క్రీన్స్ పర్సెంటేజ్ ఇస్తే సినిమాలు వేస్తామనడంతో మంటలు రేగాయి. ఇదే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా అలా పర్సెంటేజ్ ఇస్తే తాము మునిగిపోతామని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు బాగుచేస్తే జనాలు వస్తారని.. థియేటర్ ఓనర్ల కంటే లీజుకు తీసుకున్న వాళ్లను బతికించడానికి మేమెందుకు చచ్చిపోవాలని నిర్మాతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తమ చేతిలో పెద్ద సినిమాలు లేవనే కొందరు పెద్ద మనుషులు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మైత్రి రవిశంకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎగ్జిబిటర్ల తీరు బెదిరిస్తున్నట్లు ఉందంటూ మరో నిర్మాత సాహు గారపాటి తెలిపారు. పర్సెంటేజ్‌లకు మేం వ్యతిరేకం కాదని.. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు.. కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నారు రవి. కనీసం రన్నింగ్‌లో ఉన్న సినిమాలకు ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అప్లై చేయొద్దని.. వార్ 2 నుంచి నిన్న మొన్నటి సంక్రాంతి సినిమాల వరకు గుర్తుకురాని సింగిల్ స్క్రీన్స్ ఇష్యూ.. పెద్ది విడుదలకు ముందే ఎందుకు గుర్తొచ్చిందంటూ ప్రశ్నించారు మైత్రి రవి. ఇక ప్లేస్ దొరికితే మల్టీప్లెక్స్ కడతానన్న నాగవంశీ కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చారు సునీల్ నారంగ్. నైజాంలో తమకు 33 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయని.. రాబోయే ఐదేళ్లలో ఇండియా వ్యాప్తంగా 500 స్క్రీన్స్ నిర్మిస్తామని చెబుతూ మైత్రి రవి, వంశీలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి ఈ వివాదం ముదిరి ముదిరి పెద్ది సినిమాపై ఎంతవరకు పడుతుందో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అబద్దమే..శారద చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రం నిజం !! దీంతో ఆమెకు రూ.574 కోట్ల ఆదాయం

CM Vijay: 0277′ విజయ్‌ కారు నెంబర్ వెనుక గుండెలు పిండేసే కథ

స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త

Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??

Follow Us