AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay: ఒక్క విజయంతో మారిపోయిన విజయ్ జాతకం

CM Vijay: ఒక్క విజయంతో మారిపోయిన విజయ్ జాతకం

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 14, 2026 | 8:38 PM

Share

తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లో ఘన విజయంతో పాటు గ్లోబల్ సెలబ్రిటీ ర్యాంకింగ్స్‌లోనూ సంచలనం సృష్టిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ పోర్టల్ IMDB విడుదల చేసిన ‘మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్’ జాబితాలో విజయ్ రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు ఓర్మాక్స్ సర్వేలో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉండగా, విజయ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. టాప్ 10లో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, నాని వంటి దక్షిణాది స్టార్ హీరోలు ఆధిపత్యం చాటడం విశేషం.

ఒక్క గెలుపు.. ఒకే ఒక్క గెలుపుతో ఆయన రేంజ్ మారిపోయింది. అంతకుముందు కూడా ఆయన స్టారే కానీ ఇప్పుడు ఆయన పేరే ఓ సంచలనం. మనం మాట్లాడుకుంటున్నది విజయ్ గురించే..! పొలిటికల్‌గా బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసారు. అందులోనే మన టాలీవుడ్ హీరోలు కూడా పాలు పంచుకున్నారు. మరి అదేంటో మనం కూడా చూద్దామా..? విజయ్ పేరు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుందిప్పుడు. గ్లోబల్ సర్వేలలో దళపతి దూకుడు మామూలుగా లేదు. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్ IMDB విడుదల చేసిన ‘మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీల’ జాబితాలో విజయ్‌ ఏకంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.. గతవారం ఈయన ప్లేస్ 21.. ఇప్పుడేకంగా రెండో ప్లేస్‌కు వచ్చేసారు. IMDB లిస్టులో విజయ్ రెండో స్థానం అంటే చిన్న విషయం కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా వినియోగదారుల రియల్ టైమ్ యూజ్ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు IMDB సంస్థ తెలిపింది. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో నటుడు, దర్శకుడు అంబరీష్ శర్మ ఉండగా.. సాయి పల్లవి 7వ స్థానంలో నిలిచారు. ఏక్ దిన్ సినిమాతో ఈమె బాగా ట్రెండ్ అయ్యారు. IMDB లిస్టులోనే కాదు.. మరో గ్లోబల్ సర్వే ఓర్మాక్స్ లిస్టులోనూ విజయ్ దూకుడు చూపించారు. అయితే ఇందులో టాప్ ప్లేస్‌లో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా ప్రభాస్ నెంబర్ 1 ప్లేస్‌లో ఉన్నారు. ఆయన తర్వాత 2వ స్థానంలో విజయ్ ఉన్నారు. షారుక్ ఖాన్, అల్లు అర్జున్ కూడా టాప్ 5లోనే ఉన్నారని తెలుస్తుంది. ఓర్మాక్స్ సర్వేలో కొన్ని వారాలుగా అంతా సౌత్ హీరోల హవానే కనిపించింది. ప్రభాస్, విజయ్, బన్నీ లాంటి వాళ్లు టాప్ 5లో ఉంటే.. టాప్ 10లోనూ మనోళ్లే కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, నాని లాంటి మన స్టార్ హీరోలే ఓర్మాక్స్ సర్వేను కొన్నాళ్లుగా డామినేట్ చేస్తున్నారు. మొత్తానికి గ్లోబల్ సర్వేలు రెండింట్లోనూ విజయ్ రప్ఫాడించగా.. ఓర్మాక్స్‌లో మనోళ్లు దుమ్ము దులిపేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అబద్దమే..శారద చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రం నిజం !! దీంతో ఆమెకు రూ.574 కోట్ల ఆదాయం

CM Vijay: 0277′ విజయ్‌ కారు నెంబర్ వెనుక గుండెలు పిండేసే కథ

స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త

Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??

Follow Us