AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మున్సిపల్ టాక్స్ కట్టలేదని.. చెత్తతో భలే ట్రీట్మెంట్ ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది!

పన్నుల వసూలు కోసం మున్సిపల్ అధికారులు వినూత్న, దూకుడు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో పన్నులు చెల్లించని ఒక ఫంక్షన్ హాల్ యజమానికి మున్సిపల్ సిబ్బంది గట్టి షాక్ ఇచ్చారు. బల్క్ వేస్టేజ్ (భారీ వ్యర్థాల) తొలగింపు పన్నులను దీర్ఘకాలంగా చెల్లించకుండా మొండికేస్తున్న విబిఎస్ ఫంక్షన్ హాల్ ప్రధాన గేటు ముందే మున్సిపల్ సిబ్బంది ఏకంగా చెత్తను తెచ్చి డంప్ చేశారు.

మున్సిపల్ టాక్స్ కట్టలేదని.. చెత్తతో భలే ట్రీట్మెంట్ ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది!
Dumped Garbage In Front Function Hall
Raju M P R
| Edited By: |

Updated on: May 14, 2026 | 8:52 PM

Share

పన్నుల వసూలు కోసం మున్సిపల్ అధికారులు వినూత్న, దూకుడు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో పన్నులు చెల్లించని ఒక ఫంక్షన్ హాల్ యజమానికి మున్సిపల్ సిబ్బంది గట్టి షాక్ ఇచ్చారు. బల్క్ వేస్టేజ్ (భారీ వ్యర్థాల) తొలగింపు పన్నులను దీర్ఘకాలంగా చెల్లించకుండా మొండికేస్తున్న విబిఎస్ ఫంక్షన్ హాల్ ప్రధాన గేటు ముందే మున్సిపల్ సిబ్బంది ఏకంగా చెత్తను తెచ్చి డంప్ చేశారు.

నిబంధనల ప్రకారం ఫంక్షన్ హాల్‌లో ఏదైనా శుభకార్యం జరిగితే, వ్యర్థాల తొలగింపునకు మున్సిపాలిటీకి రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సదరు యజమాని ఎన్నో పెళ్లిళ్లు, కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎలాంటి పన్నులు కట్టకుండా ఆ చెత్తను రోడ్డుపై పడేస్తున్నారు. స్థానికులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటివరకు మున్సిపల్ సిబ్బందే ఆ చెత్తను తొలగిస్తూ వచ్చారు. పన్ను బకాయిలు చెల్లించాలని అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, యజమాని పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బకాయిలు వసూలు చేయడానికి ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేశారు.

గేటు ముందే చెత్త వేయడంతో వచ్చిన దుర్వాసన భరించలేక స్థానికులు నిరసన వ్యక్తంచేశారు. చివరకు పరిస్థితి తీవ్రతను గమనించిన ఫంక్షన్ హాల్ యజమాని దిగివచ్చి, తన మొండి బకాయిలను పూర్తిగా చెల్లించాడు. పన్ను వసూలైన వెంటనే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది అక్కడ ఉన్న చెత్తను తొలగించారు. పన్నులు కట్టకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వీడియో ఇక్కడ  చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us