పంజాబ్‌లోని లుధియానాలో అన్నదమ్ములు తమ సోదరి మన్‌ప్రీత్‌కు రూ.50 లక్షల విలువైన కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. 2007లో తండ్రి మరణం తర్వాత కుటుంబానికి అండగా నిలిచిన మన్‌ప్రీత్ ధైర్యానికి ఇది కృతజ్ఞతగా సోదరులు వివరించారు. ఈ హృదయపూర్వక ఘటనకు మన్‌ప్రీత్ కన్నీటి పర్యంతమైంది.