AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Government Jobs: ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 1523 యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

AP Universities Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, RGUKT లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం మే 15న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించగా, ఉన్నత విద్యాశాఖ నేడు అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

AP Government Jobs: ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 1523 యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
AP Universities Recruitment 2026
Rajashekher G
|

Updated on: May 15, 2026 | 8:45 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జారీ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం శుక్రవారం(మే 15) నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతి తెలిపింది. ఈ క్రమంలో ఉన్నత విద్యాశాఖ నేడు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 19 విశ్వవిద్యాలయాలు, ఆర్జీయూకేటీ (RGUKT) సంస్థల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.

ఈ నియామకాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అనేక విభాగాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటంతో, విద్యార్థుల బోధన, పరిశోధనలపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ స్థాయిలో ఫ్యాకల్టీ నియామకాలకు శ్రీకారం చుట్టింది.

పోస్టుల వివరాలు

ప్రభుత్వం విడుదల చేయనున్న నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో:

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – 1,020
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు – 334
  • ప్రొఫెసర్ పోస్టులు – 63
  • లెక్చరర్ పోస్టులు – 104
  • బ్యాక్‌లాగ్ పోస్టులు – 279

ఈ నియామకాల్లో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి అదనపు వెయిటేజ్ ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

మే 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ

అభ్యర్థుల నుంచి దరఖాస్తులను మే 18 నుంచి ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నారు. నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అభ్యర్థులు అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అధికారిక వెబ్‌సైట్‌లు: AP Universities Recruitment Portal కోసం ఇక్కడ క్లిక్ చేయండి. AP Job Calendar Portal కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎందుకు కీలకమైంది?

రాష్ట్ర విభజన తర్వాత విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ అనేది చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. 2023లో విడుదలైన కొన్ని నియామక నోటిఫికేషన్లు రిజర్వేషన్ రోస్టర్ వివాదాల కారణంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త విధానంతో ప్రభుత్వం తిరిగి నియామక ప్రక్రియ ప్రారంభించడం విశేషంగా మారింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మంజూరైన 4,343 పోస్టులకు గాను కేవలం 972 మంది మాత్రమే పనిచేస్తున్నారని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ భారీ ఖాళీల కారణంగా విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని, ఇప్పుడు చేపడుతున్న నియామకాలు అకడమిక్ ఎక్సలెన్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్‌కు ఊతమిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

యువతకు భారీ అవకాశం

పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ భారీ అవకాశంగా మారనుంది. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అధిక సంఖ్యలో ఉండటం యువ అభ్యర్థులకు ఊరటనిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో, ఉద్యోగార్థుల వర్గాల్లో ఈ నోటిఫికేషన్‌పై ఆసక్తి పెరిగింది. ప్రభుత్వం సమయపాలనతో నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించడం అభ్యర్థుల్లో ఆశలు పెంచుతోంది.

Follow Us