AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Achyuth: ‘హీరో అచ్యుత్ నా చేతుల్లోనే చనిపోయాడు’.. ఆరోజు ఏం జరిగిందో చెప్పిన ప్రాణ స్నేహితుడు

సినిమా ఇండస్ట్రీలో కొందరి నటులను మనం ఎప్పటికీ మర్చిపోలేం. వాళ్లు ఈ లోకాన్ని విడిచి ఏళ్లు గడుస్తున్నా సరే ఇంకా మన మధ్యనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది . అలా ఎప్పుడూ గుర్తుండిపోయే నటుల్లో అచ్యుత్ కూడా ఒకరు. ఈనటుడు చనిపోయి సుమారు 25 ఏళ్లు అవుతుంది.

Actor Achyuth: 'హీరో అచ్యుత్ నా చేతుల్లోనే చనిపోయాడు'.. ఆరోజు ఏం జరిగిందో చెప్పిన ప్రాణ స్నేహితుడు
Actor Achyuth
Basha Shek
|

Updated on: May 15, 2026 | 12:40 PM

Share

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది నటీనటులు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ గా ఉంటున్న సమయంలోనే హఠాన్మరణం చెందారు. అలాంటి వారిలో అచ్యుత్ ఒకరు. ఈ నటుడి గురించి ఈతరం ఆడియెన్స్ కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ 1990-2000 జనరేషన్ ఆడియెన్స్ కు ఇతను ఫేవరెట్ యాక్టర్. హీరోగా పెద్దగా సినిమాలు చేయకున్నా అంతకు మించిన అభిమానమే సొంతం చేసుకున్నాడు. చాలా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లకు నటించాడు అచ్యుత్. చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. పవన్ తమ్ముడు, చిరంజీవి బావగారు బాగున్నారా, బాలకృష్ణ నరసింహా నాయుడు, వెంకటేష్ కలిసుందాం రా, మహేష్ బాబు మురారి, డాడీ, వాసు వంటి సినిమాలు అచ్యుత్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటారు అచ్యుత్. అన్వేషితలాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించాడు. ఇలా చాలా ఏళ్ల పాటు తన నటనతో ఆడియెన్స్ ను అలరించిన అచ్యుత్ 2002లో హఠాత్తుగా కన్నుమూశాడు. అప్పటికి అతనికి కేవలం 42 ఏళ్లు మాత్రమే.

చాలా మంది లాగే అచ్యుత్ మరణంపై రకరకాల పుకార్లు వచ్చాయి. సినిమాల్లో సంపాదించిందంతా బిజినెస్ లో పెట్టాడని, అక్కడ పూర్తిగా నష్టాలొచ్చాయని, నమ్ముకున్న స్నేహితులే దాన్ని నట్టేటా ముంచడంతో అచ్యుత్ అప్పుల పాలయ్యాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై అచ్యుత్ గుండెపోటుతో చనిపోయాడని కొందరు టీవీ నటులు చెబుతుంటారు. అయితే ఇదే విషయంపై అచ్యుత్ ప్రాణ స్నేహితుడు, నటుడు ఎఫ్‌2 ఫేమ్ ప్రదీప్ కొన్ని సంచలన విషయాలు చెప్పారు.

ఆరోజు ఫోన్ చేసి..

‘అచ్యుత్ మరణాన్ని నేను దగ్గరుండి చూసాను. అతను నా చేతుల్లోనే చనిపోయాడు. అచ్యుత్ చనిపోయే ముందు రోజు కూడా నేను మాట్లాడాను. షూటింగ్ ఉంది అన్నయ్య వెళ్తున్నాను అన్నాడు. ఆ సమయంలో వాడు మాట్లాడేటప్పుడు ఆయాస పడడం నేను గమనించాను. ఏమైందిరా అంత బాగానే ఉందా అంటే, అంతా బాగానే ఉంది అన్నాడు. కానీ వాడి శరీరం లో బాగా కొలెస్ట్రాల్ పేరుకుపోయింది. దాని వల్ల పక్క రోజే గుండెపోటు వచ్చింది. అచ్యుత్ చాలా మంచి వాడు. అందరితోనే బాగా కలిసిపోయేవాడు. దేని మీద పెద్దగా ఆశ ఉండేది కాదు. కానీ తిండి మాత్రం బాగా తినేవాడు’ అని చెప్పుకొచ్చారు ప్రదీప్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us