AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: దీపికకు కోపం వస్తే ఇలా చేస్తుందా? షూటింగ్‌లోనే డైరెక్టర్ తల పగలగొట్టిందిగా.. వీడియో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లై, పిల్లలున్నా ఆమె రేంజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. హిందీతో పాటు తెలుగులోనూ ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా సినిమాలో కథానాయికగా చేస్తోంది దీపిక.

Deepika Padukone: దీపికకు కోపం వస్తే ఇలా చేస్తుందా? షూటింగ్‌లోనే డైరెక్టర్ తల పగలగొట్టిందిగా.. వీడియో
Deepika Padukone
Basha Shek
|

Updated on: May 14, 2026 | 5:45 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఇప్పుడు తెలుగు సినిమాలతోనూ బిజీ అవుతోంది. ఇప్పటికే ఆమె ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో హీరోయిన్ గా నటించింది. తన దైన నటనతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘రాకా’లోనూ దీపికనే హీరోయిన్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక హిందీలోనూ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. హీరో రణ్ వీర్ సింగ్ తో పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలు తగ్గినప్పటికీ దీపిక క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఇదంతా పక్కన పెడితే దీపికకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు వామ్మో దీపికకు కోపం చాలా ఎక్కువేనంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో చెన్నై ఎక్స్ ప్రెస్ ఒకటి. సౌత్ ఇండియన్ సినిమాల ఫ్లేవర్ తో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇందులో హీరోగా నటించాడు. 2013లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

అయితే ఈ సినిమా సెట్ లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ సెట్ లో దీపికా పదుకొనే రిలాక్స్ డ్ గా కూల్ డ్రింక్ తాగుతుండగా డైరెక్టర్ రోహిత్ శెట్టి అడ్డుకుంటాడు. దీంతో కోపం తెచ్చుకున్న దీపికా పదుకొనే తన చేతిలోని బాటిల్ ని తీసుకొని, రోహిత్ శెట్టి తలపై కొడుతుంది. అంతే బాటిల్ ముక్కలవుతుంది. దెబ్బకు రోహిత్ శెట్టికి రక్తం కారుతుంది. దీంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే ఇదంతా ఒక ఫన్నీ ఇన్సిడెంట్. దీపికా చేతిలో ఉన్నది నిజమైన బాటిల్ కాదు , షుగర్ బాటిల్. మన బిగ్ బాస్ రియాలిటీ షోస్ లో నామినేషన్స్ సమయంలో ఇలాంటి షుగర్ బాటిల్స్ ను ఉపయోగిస్తుంటారు. అదే ఇది. కేవలం ఫన్నీ బ్లూపర్ గానే ఈ షాట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by GLAMSHAM.COM (@glamsham)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు