Jabardasth Tanmay: మా నాన్న చనిపోయినప్పుడు జబర్దస్త్ నుంచి అతనొక్కడే వచ్చాడు.. దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు
జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో తన్మయి ఒకరు. తన నటన, గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ని జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడింది. ముఖ్యంగా అబ్బాయిగా పుట్టినప్పటికీ అమ్మాయిగా మారే క్రమంలో తీవ్ర అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంది.

ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది జబర్దస్త్ కామెడీ షో. ఇప్పుడంటే ఈ షోలో లేడీ కమెడియన్స్ కూడా ఉన్నారు ఇంతకు ముందు కొందరు మేల్ కంటెస్టెంట్లే లేడి గెటప్‌తో అలరించేవారు. మరి కొందరు మాత్రం అమ్మాయిలుగా మారి ఈ షోలో సందడి చేశారు. అలా అబ్బాయిగా పుట్టి అమ్మయిగా జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేసిన వారిలో తన్మయి ఒకరు. అబ్బాయిగా పుట్టినప్పటికీ హార్మోన్ల అసమతుల్యత కారణంగా తాను లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఓ సందర్భంలో ధైర్యంగా చెప్పుకొచ్చింది తన్మయి. కేవలం జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లో చాలా కాలం పాటు సందడి చేసింది తన్మయి. అయితే ఇప్పుడు పెద్దగా స్క్రీన్ పై కనిపించడం లేదామె. అప్పుడప్పుడు మాత్రమే బుల్లితెరపై దర్శనమిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్, వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. అలాగే జబర్దస్త్ నటీనటులతో కలిసి ఈవెంట్స్ కు కూడా వెళుతుంటుంది. అయితే సుమారు రెండేళ్ల క్రితం తన్మయి ఫ్యామిలీలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ సమయంలో ‘కొడుకునైనా, కూతురినైనా నేను మీ బిడ్డనే’ అంటూ దుఃఖాన్ని దిగమింగుతూ తానే దగ్గరుండి తండ్రి అంతిమ సంస్కారాలన్నీ నిర్వహించింది. అయితే ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తన్మయి బాగా ఎమోషనల్ అయ్యింది.
నాన్న చనిపోయే ముందు రోజు రాత్రి షూటింగ్ చేసుకొని రాత్రి ఇంటికి వచ్చాను. నాన్నతో వీడియో కాల్ కూడా మాట్లాడాను. కానీ ఆ తర్వాతి రోజే ఉదయం 11 గంటలకు నాన్న చనిపోయాడు అని వార్త వచ్చింది. నాకు ఏం చేయాలో తోచలేదు. దుఃఖం పొంగుకొచ్చింది. కాళ్లు చేతులు ఆడలేదు. వెంటనే నేను విజయవాడ వెళ్లాలి. చాలా మందికి ఫోన్ చేశాను. కానీ ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కి షూట్ ఉంది లేకపోతే వచ్చేవాడు. అయితే ఆ సమయంలో నా కోసం అన్నీ పనులు వదిలి పెట్టుకుని వచ్చాడు నూకరాజు . అతని పనులు, షూటింగ్ అన్ని అప్పటికప్పుడు ఆపేసి కార్ తీసుకుని వచ్చాడు. నన్ను విజయవాడకు తీసుకెళ్లాడు. నన్ను ఓదారుస్తూ, నాకు దైర్యం చెప్తూ నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పాడు. ఆ క్లిష్ట సమయంలో జబర్దస్త్ లో నూకరాజు తప్ప ఇంకెవరూ నాకు సపోర్ట్ చేయలేదు’
తల్లితో జబర్దస్త్ తన్మయి..
View this post on Instagram
‘ప్రస్తుతం నాకు ఉన్న ఫ్రెండ్స్ నూకరాజు, ఇమ్మాన్యుయేల్ మాత్రమే. వారిద్దరు నన్ను అక్కా అని పిలుస్తారు. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఎవరితోనూ షేర్ చేసుకోను. కానీ నూకరాజు, ఇమ్మాన్యుయేల్ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు’ అని చెప్పుకొచ్చింది తన్మయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




