AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: 5 లక్షలు అవసరమై అర్ధరాత్రి ఆ హీరోకు ఫోన్ చేశా.. చెప్పేది పూర్తిగా కూడా వినకుండానే: మంచు మనోజ్

సెకెండ్ ఇన్నింగ్స్ లో మంచు మనోజ్ దూసుకుపోతున్నాడు. మిరాయ్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఈ మంచు వారబ్బాయి చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఈ ట్యాలెంటెడ్ హీరో ఓ సందర్భంలో తన తోటి హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Manchu Manoj: 5 లక్షలు అవసరమై అర్ధరాత్రి ఆ హీరోకు ఫోన్ చేశా.. చెప్పేది పూర్తిగా కూడా వినకుండానే: మంచు మనోజ్
Manchu Manoj
Basha Shek
|

Updated on: May 12, 2026 | 5:16 PM

Share

మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ పై ఎంత సరదాగా కనిపిస్తాడో రియల్ లైఫ్ లోనూ అంతే జోవియల్ గా ఉంటాడు. తన తోటి నటీనటులతో ఎంతో సరదాగా ఫన్నీగా ఉంటాడు. కాగా చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తేజ సజ్జా నటించిన మిరాయ్ లో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు మనోజ్. ఇందులో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి అనే డిఫరెంట్ మూవీ షూటింగ్ తో బిజీ బిజీగా ఉంటున్నాడు మంచు మనోజ్. కాగా మంచు, మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ మంచు, మెగా హీరోలు మాత్రం ఎంతో కలివిడిగా ఉంటారు. ముఖ్యంగా మంచు మనోజ్ కు మెగా హీరోలతో మంచి అనుబంధం ఉంది. ఆ మధ్యన మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ అనే కొత్త సినిమా ప్రారంభోత్సవంలో రామ్ చరణ్ సందడి చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలో రామ్ చరణ్ చేసిన సాయం గురించి ఓ సందర్భంలో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

‘కొన్నేళ్ల క్రితం నేను ఓ కోర్స్ నేర్చుకునేందుకు అమెరికాకు వెళ్లాను. ఆ టైంలో దుబాయ్‌లో ఉంటున్న ఓ ఫ్యామిలీకి వీసా కష్టాలు వచ్చాయి. ఇండియాకు తిరిగి రావడానికి డబ్బులు లేవు. ఓ ఐదు లక్షలు కావాలని నాకు ఫోన్ వచ్చింది. ఆ టైంకి నా దగ్గర కూడా డబ్బులు లేవు. బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ అయిపోయింది. కానీ వాళ్లకు ఎలాగైనా సాయం చేయాలని అనుకున్నాను. వెంటనే రామ్ చరణ్ కు ఫోన్ చేశాను. అప్పుడు రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ ఓ ప్రీమియర్ షోలో ఉన్నారు. ఫోన్ లిఫ్ట్ చేసిన రామ్ చరణ్ మెల్లిగా మాట్లాడుతూ.. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావ్ అని అడిగాడు. ఇలా అవసరం ఉంది.. డబ్బులు కావాలి అని పూర్తిగా చెప్పలోపు.. ఎంత కావాలి.. అకౌంట్ నంబర్ పంపు అని అన్నాడు. అంతే కేవలం నిమిషంలో చరణ్ డబ్బులు పంపించేశాడు’ అని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!