AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Priya: నేను విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్‌ని.. రూ.399 కూడా కట్టా.. టాలీవుడ్ నటుడి కామెంట్స్ వైరల్

చాలా మంది సెలబ్రిటీలు ఆదాయం కోసం ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. విష్ణుప్రియతో మొదలైన ఈ వ్యవహారం ఆ తర్వాత అనన్య నాగళ్ల, అషు రెడ్డి తదితర బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో చేరారు.

Vishnu Priya: నేను విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్‌ని.. రూ.399  కూడా కట్టా.. టాలీవుడ్ నటుడి కామెంట్స్ వైరల్
Vishnu Priya
Basha Shek
|

Updated on: May 11, 2026 | 8:10 PM

Share

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ తన క్రియేటర్ల కోసం తీసుకొచ్చిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ఎంతో మందికి ఆదాయ మార్గంగా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రెటీలకు ఈ ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అంటూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ రోజు రోజుకు తమ సబ్ స్క్రైబర్లను పెంచుకుంటున్నారు చాలా మంది సెలబ్రిటీలు. ఇప్పటికే బుల్లితెర సెలబ్రిటీలైన విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేశారు. దెబ్బకు వీరి సబ్ స్క్రైబర్లు కూడా అమాంతం పెరిగిపోయారు. అయితే ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న సెలబ్రిటీలపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఎక్స్‌క్లూజివ్‌గా కొందరికే ఇలాంటి కంటెంట్ ఇస్తున్నామని సెలబ్రిటీలు కవర్ చేసుకుంటున్నా వీరిపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా విష్ణుప్రియ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు అభ్యంతరకరంగా ఉండటంతో ఆమెపై కేసులు పెట్టే వరకు విషయం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైతే ఈ కేసు విషయం బయటకు వచ్చిందో విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సుమారుగా 5000 వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విష్ణుప్రియ సంపాదన కూడా అమాంతం పెరిగిపోయింది.

కాగా విష్ణుప్రియ ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రైబర్లలో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా ఉన్నాడట. అతను మరెవరో కాదు టేస్టీ తేజ. ఈ విషయాన్ని అతనే స్వయంగా బయట పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. విష్ణుప్రియ యాంకర్ గా వ్యవహరిస్తోన్న ఓ షోకు టీస్టీ తేజ హాజరయ్యాడు. అక్కడ ఉన్న యాంకర్ ను చూసి మీరెవరు అని అడగ్గా.. నేను విష్ణుప్రియ అంటుంది. నా కళ్లు నన్ను మోసం చేయవు, ఎందుకంటే ఈ అమ్మాయికి నేను ట్రూలీ సబ్‌స్క్రైబర్‌ని. 399 రూపాయలు కూడా కట్టాను. అక్కడ ఇలా ఉండదే’ అంటూ టేస్టీ తేజ చెబుతాడు. దీంతో అక్కడే ఉన్న విష్ణుప్రియ బాగా సిగ్గుపడిపోతుంది. ఇక ఇదే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన ఆర్కే రోజా విష్ణుప్రియను చీరలో చూసిన జడ్జి ఆర్కే రోజా.. మీరెవరు అని అడుగుతుంది. నేను విష్ణుప్రియని అని చెప్పగా.. విష్ణుప్రియ చీరకట్టుకుని వచ్చిందేంటి? అని ఆశ్చర్యపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

విష్ణు ప్రియ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us