AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 3500 కోట్ల కలెక్షన్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలో 8.3 రేటింగ్

మార్చిలో దేశవ్యాప్తంగా 'ధురంధర్ ది రివేంజ్ ( ధురంధర్ 2) హవా నడిచింది. ఈ సినిమా వచ్చిన వారానికి ఈ మూవీ కూడా రిలీజైంది. ధురంధర్ 2 పోటీని తట్టుకుని మరీ బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 3500 కోట్ల కలెక్షన్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలో 8.3 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 10, 2026 | 6:52 PM

Share

గత వారం పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, పాపం ప్రతాప్, అడివి శేష్ డెకాయిట్, వాలా 2 ఇలా ఎన్నో సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా. ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం.ఈ మూవీ మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధురంధర్ 2 రిలీజైన వారం రోజులకే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ధురంధర్ 2తో సమానంగా కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.3500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి లీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆడియెన్స్ కు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది.

ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? అంతరిక్ష నేపథ్యంగా సాగే ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీ పేరు ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ర్యాన్ గాస్లింగ్ హీరోగా నటించాడు. ఇందులో అతను రేల్యాండ్ గ్రేస్ అనే వ్యోమగామి పాత్రలో హీరో నటించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే.. హీరో రేల్యాండ్ గ్రేస్ తన గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడన్నదే ఈ సినిమా కథ. కంటెంట్ పరంగా ఓకే అని టాక్ వస్తున్నప్పటికీ ఈ సినిమాలో విజువల్స్ అదిరిపోయాయని రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ మూవీస్ లో అందుబాటులో ఉంది .త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ఓటీటీల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ తెలుగు ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us