TVK Vijay: విజయ్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పవన్, NTRతో సూపర్ హిట్స్
మరికొన్ని గంటల్లో తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనుండడం విశేషం. దీంతో విజయ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

తమిళనాడు రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సమయంలో విజయ్ పేరు నెట్టింట మార్మోగుతోంది. ఆయన నటించిన సినిమాలు, కలిసి యాక్ట్ చేసిన హీరోయిన్లు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పై ఫొటో కూడా అందులో ఒకటి. ఇందులో టీవీకే అధినేత విజయ్ దళపతితో ఉన్నఅమ్మాయిని గుర్తు పట్టారా? గతంలో విజయ్ తో కలిసి ఛైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఈ క్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్. పవర్ కల్యాణ్, ఎన్టీఆర్, నాని తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ కాస్తా బొద్దుగుమ్మగా మారిపోయింది. దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఈ హీరోయిన్ స్క్రీన్ పై కనిపించి సుమారు రెండేళ్లు అవుతోంది.
పై ఫొటోలో విజయ్ తో ఉన్న ఆ అమ్మాయి మరెవరో కాదు టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా థామస్. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా చేసిందీ అందాల తార. తమిళ, మలయాళంలోని పలువురి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా విజయ్ దళపతి హీరోగా నటించిన కురువి అనే సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది నివేదా. పై ఫొటో కూడా ఆ సినిమాకు సంబంధించినదే.
నివేదా థామస్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
కాగా నివేదా థామస్ చివరిగా ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమాలో కనిపించింది. 2024లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ పిల్లాడికి తల్లి పాత్రలో నటించి నివేదా అందరి మన్ననలు అందుకుంది. అయితే ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదీ అందాల తార.
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవితో నివేదా థామస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




