AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Vinod: ‘జబర్దస్త్’ మానేసిన వినోద్ ఇప్పుడేం చేస్తున్నాడు? ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నాడో తెలుసా?

జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ ఇప్పుడు ఆ కామెడీ షోతో పాటు బుల్లితెరకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. మరి అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నాడు? తన ఇన్ కమ్ సోర్స్ ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం రండి.

Jabardasth Vinod: 'జబర్దస్త్' మానేసిన వినోద్ ఇప్పుడేం చేస్తున్నాడు? ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నాడో తెలుసా?
Jabardasth Vinod
Basha Shek
|

Updated on: May 07, 2026 | 7:43 PM

Share

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వారిలో వినోద్ అలియాస్ వినోదిని కూడా ఒకరు. ముఖ్యంగా ఈ టాప్ కామెడీ షోలో లేడీ గెటప్స్ తో బాగా పాపులర్ అయ్యాడు వినోద్. చీర కట్టి బొట్టు పెడితే అచ్చం అమ్మయిలాగే కనిపిస్తాడీ నటుడు. అందుకు తగ్గట్టుగానే జబర్దస్త్ షోలో చాలా మంది అతనిని చూసి మొదట అమ్మాయే అనుకున్నారు కూడా. ముఖ్యంగా చమ్మక్ చంద్ర, వినోద్ కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అయితే గత కొన్నేళ్లుగా జబర్దస్త్ తో పాటు బుల్లితెరకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నాడు వినోద్. మరి తన ఇన్ కమ్ సోర్స్ ఏంటనుకుంటున్నారా? జబర్దస్త్ కు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు వినోద్. ‘వినోద్ తో వినోదం’ పేరుతో ఒక సొంత యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడీ కమెడియన్. ఇందులో ఆసక్తికరమైన వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు వినోద్. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తున్నాడు. దీంతో పాటు  బయట ఈవెంట్లు, షోస్ లు కూడా చేస్తూ బిజీగా ఉంటున్నాడు.

కాగా ఆ మధ్యన జబర్దస్త్ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యాడు వినోద్. తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను తీసుకుని ఈ షోకు వచ్చాడు. ఆ సమయంలో చమ్మక్ చంద్ర గురించి చెబుతూ వినోద్ ఎమోషనల్ అయ్యాడు. తనకి అవకాశం ఇచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేలా చేసిన చంద్రన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని వినోద్ భావోద్వేగానికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

భార్య, బిడ్డలతో జబర్దస్త్ వినోద్..

కాగా జబర్దస్త్ వినోద్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. తన మేనత్త కూతురు విజయలక్ష్మినే పెళ్లి చేసుకున్నాడీ జబర్దస్త్ కమెడియన్. ఆమె స్వస్థలం కడప. లాక్ డౌన్ సమయంలో వీరి వివాహం సింపుల్ గా జరిగింది. 2022లో వినోద్- విజయలక్ష్మీ దంపతులకు ఓ కూతురు పుట్టింది. ఇక 2024లో బాబు పుట్టాడు. ప్రస్తుతం తన ఇద్దరి పిల్లల పెంపకంలో బిజీగా ఉంటున్నాడు వినోద్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి