AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. యాంకర్ కూడా..

హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా, యాంకర్ గా.. ఇలా పలు రంగాల్లో సత్తా చాటుతున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. సినిమాలు, సీరియల్స్, టీవీ ప్రోగ్రామ్స్, ఓటీటీలు వెబ్ సిరీస్ లు ఇలా అన్నీ ఎంటర్ టైన్మెంట్ ప్లాట్ ఫామ్స్ లోనూ అదరగొడుతున్నాడు.

Tollywood: చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. యాంకర్ కూడా..
Chiranjeevi
Basha Shek
|

Updated on: May 02, 2026 | 6:22 PM

Share

పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఈ చంటోడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా, యాంకర్ గా.. ఇలా తన మల్టీ ట్యాలెంట్ చూపిస్తున్నాడు. సినిమాలు, సీరియల్స్ , టీవీ షోస్, వెబ్ సిరీస్ ల్లోనూ అదరగొడుతున్నాడు. సాధారణంగా చాలా మంది ఆర్టిస్టులు సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వెళతారు. కానీ ఇతను మాత్రం చాలా డిఫరెంట్. సినిమాల్లో హీరోగా చేసి ఆ తర్వాత బుల్లితెరకు పరిచయం అయ్యాడు. అంతకు ముందే ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో బాలనటుడిగా ఆకట్టుకున్నాడు. ఏడవ తరగతి చదువుకుంటున్న సమయంలోనే తన నటనా ప్రతిభకు ఏకంగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు. అది కూడా దివంగత సీఎం వైఎస్సార్ చేతుల మీదుగా. అలాగే పలు సార్లు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశాడు. ఆయతో గడిపిన ఆ మధురమైన క్షణాలను ఫొటో ఫ్రేమ్స్ రూపంలో పదిలంగా దాచుకున్నాడు. మరి ఇంతకీ అతనెవరో గుర్తు పట్టారా?

ప్రస్తుతం సీరియల్స్ తో పాటు, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న అతను మరెవరో కాదు బ్రహ్మముడి ఫేమ్ మానస్ నాగుల పల్లి. ఛైల్డ్ ఆర్టిస్టుగా బాలయ్య నరసింహనాయుడు, మహేష్ బాబు అర్జున్, రవితేజ వీడే సినిమాల్లో నటించాడు మానస్. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లోనూ నటించాడు. ఝలక్, గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం తదితర సినిమాల్లో కథానాయకుడిగా కనిపించాడు. అయితే ఎందుకో పెద్దగా క్లిక్ అవ్వలేకపోయాడు. అయితే బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌లో పాల్గొని గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నాడు. దీంతో మానస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ రియాలిటీ షో నుంచి బయటకు రాగానే కోయిలమ్మ, బ్రహ్మముడి సీరియల్స్ లో నటించాడు. తన నటనతో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ మధ్యన కొన్ని రోజుల పాటు జబర్దస్త్ యాంకర్ గా కూడా వ్యవహరించాడు మానస్. ప్రస్తుతం పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ మెరుస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

భార్య బిడ్డలతో బ్రహ్మముడి మానస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర