OTT Movie: 5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ప్రస్తుతం థియేటర్లలో అయినా, ఓటీటీలోనైనా మలయాళం సినిమాలదే హవా అని చెప్పుకోవచ్చు. తెలుగు ఆడియెన్స్ అయితూ ఈ మాలీవుడ్ సినిమాలను తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో అయితే ఈ మలయాళం సినిమాలకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. అలాంటి వారి కోసమే ఇప్పుడు మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి వచ్చేస్తోంది.

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలు లేదా ఐదు వారాల తర్వాతనే సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. మరీ బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే ఆరు లేదా ఎనిమిది వారాలు పడుతుంది. అయితే గతవారం తెలుగులోనూ విడుదలైన ఓ మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 2024లో థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న ‘వాలా’ చిత్రానికి కొనసాగింపుగా.. ‘వాలా 2’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’ అనేది ఈ మూవీ క్యాప్షన్. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన నలుగురు కుర్రాళ్లను హీరోగా పెట్టి ఈ సినిమాను ఈ తీశారు. ఏప్రిల్ 2న మలయాళంలో రిలీజైన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 26న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన వాలా 2 సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాను ప్రశంసించాడు. ఇలా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన వాలా 2 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం (ఏప్రిల్ 01) దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
వాలా 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 08 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దర్శకుడు సావిన్ ఎస్.ఏ తెరకెక్కించిన ఈ న్యూ ఏజ్ కామెడీ డ్రామాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు హషీర్, అలెన్, వినాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురు సామాన్య యువకుల జీవితాల్లోని ఒడిదుడుకులను, స్నేహాన్ని ఎంతో సహజంగా ఈ సినిమాలో చక్కగా చూపించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో మాత్రం అసలు వదిలిపెట్టద్దు.
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
Bros are back by demand!
Vaazha II: Biopic of a Billion Bros will be streaming from May 8 on JioHotstar.#Vaazha2 #JioHotstar #JioHotstarMalayalam #Vaazha #Comedy #Drama #MalayalamMovie #Friendship pic.twitter.com/lZLkVjbtol
— JioHotstar Malayalam (@JioHotstarMal) May 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




