AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: నేను మళ్లీ సినిమాలు చేయడానికి కారణం ఆ హీరోనే .. ఆసక్తికర విషయం చెప్పిన నటి లయ

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది లయ. అయితే సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ గా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయితే పిల్లలు పెరిగి పెద్ద కావడంతో ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

Actress Laya: నేను మళ్లీ సినిమాలు చేయడానికి కారణం ఆ హీరోనే .. ఆసక్తికర విషయం చెప్పిన నటి లయ
Actress Laya
Basha Shek
|

Updated on: May 01, 2026 | 5:32 PM

Share

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సావిత్రి, సౌందర్య తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సెటిలైపోయింది. అయితే ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్ద వారవ్వడంతో మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లయ ఆ మధ్యన శివాజీతో కలిసి సంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు ఆమె నటించిన మరో సినిమా వదల రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో ఆమె జగపతిబాబు భార్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతంలో జగపతిబాబు, లయ పలు సూపర్ హిట్ సినిమాల్లో జోడీగా నటించారు. మనోహరం, నాలో ఉన్న ప్రేమ, హనుమాన్ జంక్షన్, శివరామరాజు తదితర చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా చేశారు. ఇప్పుడు వదల సినిమాలో మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా లయ హీరో జగపతిబాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.  తాను  జగపతిబాబు ను చూసే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చానని తెలిపింది. ‘ మీరు చేసే వర్సటైల్ పెర్ఫార్మెన్స్ నాకు ఎంతో ఇన్‌స్పిరేషన్. ప్రతి సినిమాకు కొత్త లుక్, కొత్త స్టైల్‌తో కనిపిస్తారు. ప్రతి పాత్రలో పూర్తిగా ఒదిగిపోతారు. పాత్రకు 100 శాతం న్యాయం చేస్తారు. మేము కూడా సినిమాల్లో నటించేటప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతాం. హీరోయిన్లు సాధారణంగా లేడీ ఆర్టిస్టులను ఫాలో అవుతారు. కానీ నేను మాత్రం మిమ్మల్ని ఫాలో కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీలాగా ఏ పాత్రలోనైనా ఇట్టే జీవించగలగాలి. పాత్రలో పూర్తిగా మమేకం కావాలి. జగపతిబాబు గారి లాగా నా సెకండ్ ఇన్‌స్పిరేషన్ అవకాశం కావాలి’ అని చెప్పుకొచ్చింది లయ. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

వదల సినిమా విషయానికి వస్తే.. అకెళ్ళ వి కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

వదల సినిమా టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు