AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కూతురి కోసం తండ్రి పోరాటం.. అప్పుడే ఓటీటీలోకి లెజెండ్ శరవణణ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రముఖ బిజినెస్ మ్యాన్ శరవణన్ లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. పైగా శరవణన్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయినా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు లెజెండ్ శరవణన్.

OTT Movie: కూతురి కోసం తండ్రి పోరాటం.. అప్పుడే ఓటీటీలోకి లెజెండ్ శరవణణ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: May 02, 2026 | 3:57 PM

Share

లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లీడర్’. ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, వీటీవీ గణేశ్, అమృత అయ్యర్, ఐశ్వర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. లెజండ్ శరవణ స్పోర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కథ, కథనాల పరంగా పెద్దగా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది. రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అన్న రివ్యూలు వినిపించాయి. అయితే లెజెండ్ సినిమాతో పోల్చుకుంటే లీడర్ సినిమా కొంచెం బెటర్ అన్న కామెంట్స్ వచ్చాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన లీడర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. లీడర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలో మే 08 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇవి కూడా చదవండి

లీడర్ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. తూత్తుకుడి పోర్టు నేపథ్యంలో సాగుతుంది. ఒక మాజీ రా ఏజెంట్ అనుకోని సంఘటనల వల్ల రహస్యంగా బతకాల్సి వస్తుంది. ఈ క్రమంలో పోలీస్ కారణంగా కూతురు ప్రాణాలు ప్రమాదంలో పడటం, దాంతో అజ్ఞాతవాసాన్ని వీడి పోరాడటం వంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. స్టోరీ రోటీన్ గా ఉన్నా సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అలాగే తండ్రి కూతుళ్ల బంధానికి సంబంధించి వచ్చే సీన్స్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. మొత్తానికి యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు లీడర్ పై ఒక లుక్కేసుకోవచ్చు.

మే 08 లేదా 15న స్ట్రీమింగ్ కు ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..