AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ 11 మందివి హత్యలా? ఆత్మహత్యలా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా? తెలుగులోనూ స్ట్రీమింగ్

వీకెండ్ లో ఓ మంచి థ్రిల్లింగ్ సినిమా కానీ వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. 2018లో దేశాన్ని కుదిపేసిన ఓ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, మెంటలెక్కించే సీన్లు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

OTT Movie: ఆ 11 మందివి హత్యలా? ఆత్మహత్యలా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా? తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 02, 2026 | 6:59 PM

Share

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఓ రియల్ క్రైమ్ స్టోరీనే. మూఢనమ్మకాలు, చేతబడుల నేపథ్యంలో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. 2018లో దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పదంగా చనిపోయారు. 9 నుంచి 71 ఏళ్ల మధ్య ఉన్న మూడు తరాలకు చెందిన వారందరూ మూకుమ్మడిగా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంటారు. ఢిల్లీనే కాదు యావత్ భారతదేశాన్ని ఈ సంఘటన కుదిపేసింది. ఆ 11 మంది ఎలా చనిపోయారన్నదానిపై ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది? మరి ఆ 11 మంది ఎందుకు ఉరేసుకుని చనిపోయారు? అసలు అవి ఆత్మహత్యలేనా? లేకుంటే హత్యలా? లేకుంటే ఎవరైనా వారిని బలిదానాలు చేసుకునేలా ప్రేరేపించారా? అన్న నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా ఈ సిరీస్ ను రూపొందించారు మేకర్స్.

మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ లో నటించిన ఈ హిందీ సిరీస్ పేరు ఆఖరి సచ్. రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు సౌరవ్ దేవ్ కథను అందించారు. నిర్వికార్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ లో అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, దనిష్ ఇక్బాల్, నిషూ దీక్షిత్, క్రితి విజ్, సంజీవ్ చోప్రా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ ఆఖరి సచ్ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఆఖరి సచ్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్.. తెలుగు వెర్షన్ కూడా..

కాగా ఇదే ఘ‌ట‌న‌పై హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్ పేరిట‌ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us