AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: రేంజ్ రోవర్ గిఫ్ట్ .. ప్రభాస్‌లా ఉండాలంటే గుండెల్లో దమ్ముండాలి.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

గతంలో ప్రభాస్ తో కలిసి ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించింది. ప్రభాస్ లా నలుగురికి సాయం చేయాలంటే గుండెల్లో దమ్ము ఉండాలంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Prabhas: రేంజ్ రోవర్ గిఫ్ట్ .. ప్రభాస్‌లా ఉండాలంటే గుండెల్లో దమ్ముండాలి.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
Prabhas
Basha Shek
|

Updated on: May 10, 2026 | 5:37 PM

Share

ప్రభాస్ గొప్పతనం, దాన గుణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లదు. తన తోటీ నటీనటులకు విందు భోజనాలతో కడుపు నింపే ఆయన ఎవరికైనా కష్టం వస్తే ఇట్టే ముందుకు వస్తాడు. అవసరమైన వారికి తన వంతు సాయం చేస్తాడు. ఆయన చుట్టు ఉన్నవాళ్ల కోసం కూడా ఆయన ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటాడని ప్రభాస్‌ని దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. డార్లింగ్ తో కలిసి నటించిన స్టార్స్, హీరోయిన్స్ కూడా ఆయన చేసిన మంచి పనుల గురించి చెబుతూ ఉంటారు. అలా బుజ్జిగాడు సినిమాలో ప్రభాస కు మరదలిగా నటించిన కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఇదే క్రమంలో ప్రభాస్ పై తెగ ప్రశంసలు కురిపించిందీ అందాల తార. ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌ చాలా ఎదిగిపోయాడు. ఆయనను చూస్తే ఏ అమ్మాయి అయినా.. అలా ఉండిపోతుంది. ఎత్తు, పర్సనాలిటీ అలా ఉంటుంది మరి. మనిషి మాత్రమే కాదు ఆయన మనసు కూడా చాలా మంచిది. బాహుబలి సినిమా తర్వాత తన జిమ్‌ ట్రైనర్‌కి రేంజ్‌ రోవర్‌ కారునే గిఫ్ట్‌గా ఇచ్చాడని విన్నాం. ఇలా ఎవరు చేస్తారు? బ్యాంక్‌ అకౌంట్‌లో అందరికీ డబ్బులు ఉంటాయి. కానీ ఎవరికైనా ఎలాంటి ఫలితం ఆశించకుండా సాయం చేయాలంటే గుండెల్లో దమ్ముండాలి. అది ప్రభాస్‌లో ఉంది. ఆయనది చాలా గొప్ప మనసు.’

‘ప్రభాస్ చేసిన సహాయాలు, మంచి పనుల్లో మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. తెలియకుండా చాలా మందికి సహాయం చేశాడు. ఇక నటుడిగా చాలా కష్టపడతాడు ప్రభాస్. అందుకే ఆయన సక్సెస్‌ అయ్యాడు. ప్రభాస్ ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఆయనతో టచ్‌లో లేను. కానీ స్పిరిట్ సినిమా‌ కోసం చాలా ఎదురు చూస్తున్నా. ఫస్ట్‌డే ఫస్ట్‌ షోకి ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తా’ అని సంజనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

భర్త, పిల్లలతో నటి సంజనా గల్రాని..

కాగా, 2020లో తన జిమ్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌ రెడ్డికి ప్రభాస్‌ రేంజ్‌ రోవర్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించడం వెనుక లక్ష్మణ్‌ శ్రమ ఉంది. అందుకే ప్రభాస్‌ ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us