OTT Movie: ఇవాళే OTTలోకి వచ్చిన తమిళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. IMDBలో టాప్ రేటింగ్
గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కథా, కథనాల పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాట్టింది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.8 రేటింగ్ కూడా సాధించిన మూవీ మంగళవారం (మే12) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2), కర్తవ్య, తిమ్మరాజు పల్లి టీవీ వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటి కంటే ముందే ఓ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీకి వచ్చేసింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా మంగళవారం (మే12) అర్ధరాత్రి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ ఇప్పుడు అందుబాటులో ఉంది. విశేషమేమిటంటే.. ఈ సూపర్ హిట్ సినిమా ఏకంగా 7 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ లో పదికి 7.8 రేటింగ్ కూడా సాధించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఒక హై-ప్రొఫైల్ గెటెడ్ కమ్యూనిటీ నుంచి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ అవుతుంది. ఈ కేసును ఛేదించే బాధ్యతలను ఇన్‌స్పెక్టర్ కాళిదాస్ తీసుకుంటాడు. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగే కొద్దీ ఆ అపార్ట్ మెంట్ పెద్దలు, లాయర్.. ఇలా చాలా మందిపై అనుమానం వస్తుంది. మరోవైపు ఇదే కేసులోకి డీఎస్పీ వైష్ణవి ఎంటరవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది. కాళిదాస్, వైష్ణవి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. దీనికి తోడు పాప ఆచూకీ తెలియకపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతుంది.మరి ఆ పాపను ఎవరు అపహరించారు? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఏడు ఓటీటీల్లో భరత్ కాళిదాస్ 2
Kaalidas 2 is now streaming on OTT 🎬🔥 Time to dive into the mystery and suspense from your couch 🍿#kaalidas2 #ott4me #tamilottrelease #bingewatch pic.twitter.com/6wbNSWgFcZ
— JFW (@jfwdigital) May 12, 2026
ప్రేమిస్తే హీరో భరత్ నటించిన ఈ సినిమా పేరు ‘కాళిదాస్ 2’. గతంలో వచ్చిన కాళిదాస్ సినిమాకు ఇది సీక్వెల్. దర్శకుడు శ్రీ సెంథిల్ తెరకెక్కించిన తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో భరత్‌కు జోడీగా అబర్నతి, భవానీ శ్రీ నటించగా.. కీలక పాత్రల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, కిషోర్, అజయ్ కార్తీ, సంగీత మాధవన్ నాయర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ , ఆహా, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా, షార్ట్ ఫ్లిక్స్, లయన్స్‌గేట్ ప్లేలలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, వీటిలో ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మాత్రమే కాళిదాస్ 2 తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్..
Kaalidas 2 – Now On PrimeVideo in #Telugu, #Tamil & #Hindi#Kaalidas #Kaalidas2 pic.twitter.com/cy1UZ4uJtP
— Telugu Film Fusion (@Telugu_Fusion) May 12, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




