OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టుల మీద ట్విస్టులు.. IMDBలోనూ టాప్ రేటింగ్
కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ మంచి రేటింగ్ సొంతం చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (మే 13) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2), కర్తవ్య, తిమ్మరాజు పల్లి టీవీ వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఇందులో కాళిదాసు 2 సినిమా ఇప్పటకే అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా మొత్తం ఏడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే బుధవారం (మే 13) మరో కొత్త సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహకందని ట్విస్టులు మలయాళం ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందించాయి. ఇక ఈ సినిమా కథ కూడా కొత్తగా ఉంటుంది. వయనాడ్ నేపథ్యంలో సాగే ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక సామాన్యమైన ఆరోగ్య కార్యకర్త గా జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి లైఫ్ లోకి ఒక అపరిచితుడు రావడం, అతని కారణంగా హీరో చిక్కుల్లో పడడం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఒక వ్యక్తి స్టోరీతోనే మొదలైన ఈ సినిమా క్రమంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా మారుతుంది. అలాగే వయనాడ్ లో ఉన్న మావోయిస్టులు, పోలీసుల జీవితాలను కూడా ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఈ సినిమా పేరు ఒరు దురూహ సాహచర్యత్తిల్’ (Oru Durooha Saahacharyathil). మలయాళంలో ప్రయోగాత్మక చిత్రాలకు మారుపేరైన కుంచకో బోబన్ ఈ మూవీలో హీరోగా నటించాడు. దిలీష్ పోతన్, సాజిన్ గోపు, చిదంబరం, రాజేష్ మాధవన్, జాఫర్ ఇడుక్కి, సుధీష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువల్ ఈ సినిమాను తెరకెక్కించగా, మ్యాజిక్ ఫ్రేమ్స్, ఉదయ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, కుంచాకో బోబన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. మూవీని చూడాలనుకునేవారు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఎంజాయ్ చేయవచ్చు.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Malayalam film #OruDuroohaSaahacharyathil (2026) by #RatheeshBalakrishnanPoduval, now streaming on @NetflixIndia.
Ft. #KunchackoBoban #DileeshPothan #SajinGopu #ChidambaramSPoduval #SharanyaRNair & #JaffarIdukki.@ListinStephen @dawn1720 @magicframes2011 @PharsFilm pic.twitter.com/PYOmj82PwL
— CinemaRare (@CinemaRareIN) May 13, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




