AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చెస్‌లో ఏడు సార్లు స్టేట్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడిది ప్రత్యేక స్థానం. చాలా మంది హీరోయిన్లు గ్లామరస్ రోల్స్ కు, స్కిన్ షోకు ప్రాధాన్యమిస్తే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఫ్యామిలీ సినిమాలకే ఓటేసింది. తక్కువ సినిమాల్లోనే నటించినా తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.

Tollywood: చెస్‌లో ఏడు సార్లు స్టేట్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 13, 2026 | 7:12 PM

Share

పై ఫొటోను గమనించారా? అందులో పేపర్ క్లిప్స్ లో ఉన్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోయిన్ రేంజ్ అని చెప్పలేం కానీ అంతకు మించిన క్రేజ్ నే సొంతం చేసుకుంది అందాల తార. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ రోల్స్, స్కిన్ షోకు చాలా దూరం.అలాగే స్టార్ హీరోలతో పెద్దగా సినిమాలు కూడా చేయలేదు. కానీ తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ నటికి చిన్నప్పటి నుంచి చెస్ అంటే చాలా ఇష్టం. కేవలం ఇష్టమే కాదు.. పట్టుదలతో సాధన చేసి ఏడు సార్లు రాష్ట్రస్థాయిలో చెస్ ఛాంపియన్ గా నిలిచింది. అలాగే నేషనల్ లెవెల్ లోనూ ఎన్నో పతకాలు కైవసం చేసుకుంది. అయితే పదో తరగతి తర్వాత ఉన్నత చదువులపై దృష్టి సారించాల్సి రావడంతో చెస్ పై పెద్దగా దృష్టి సారించలేకపోయింది. గంటల కొద్దీ కోచింగ్ కు వెళ్లలేక చెస్ కు దూరమైంది. అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ మరోసారి తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల వయసులో తాను స్టేట్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంది. దీనికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో వచ్చిన న్యూస్ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తాను విజేతగా నిలిచినట్లు ఇందులో ఉంది. మరి ఈ పేపర్ క్లిప్స్ లో ఉన్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఆమె మరెరవో కాదు లయ.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లయ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా తన చిన్నప్పటి చెస్ జ్ఞాపలకాలను మరోసారి గుర్తు చేసుకుంది లయ. 12 ఏళ్ల వయసులో తాను విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచానని, అప్పటి పేపర్ క్లిప్స్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇలాంటి మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని, చిన్నప్పటి విజయాలు ఎప్పటికీ సంతోషంగానే అనిపిస్తాయని రాసుకొచ్చింది లయ. ఇదే సందర్భంగా ఈ ఘనత అందించిన అమ్మ, నాన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసిందీ అందాల తార . ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

12 ఏళ్ల వయసులో లయ ఇలా..

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

కాగా సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో బిజీ అవుతోంది లయ. నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ మధ్యన శివాజీతో కలిసి సంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు లయ నటించిన మరో సినిమా వదలా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో ఆమె జగపతిబాబు భార్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

లయ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us