AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్.. అదిరిపోతున్న క్రేజ్

టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్.. అదిరిపోతున్న క్రేజ్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 11, 2026 | 4:23 PM

Share

టాలీవుడ్‌లో హీరోలు తమ ఇమేజ్‌కు భిన్నమైన దర్శకులతో చేతులు కలుపుతూ ఊహించని కాంబినేషన్స్‌కు శ్రీకారం చుడుతున్నారు. సాయి ధరమ్ తేజ్, అడివి శేష్, గోపీచంద్ వంటి స్టార్స్ తమ కంఫర్ట్ జోన్ వదిలి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి. ఇది టాలీవుడ్‌లో కొత్త ఒరవడికి నాంది పలకనుంది.

టాలీవుడ్‌లో ఊహించని క్రేజీ కాంబినేషన్స్ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నుంచి విజయ్ దేవరకొండ వరకు తమ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన దర్శకులతో ఎందుకు చేతులు కలుపుతున్నారు..? ఎవరూ ఊహించని విధంగా సెట్ అవుతున్న ఈ ప్రాజెక్ట్స్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాయి..? టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ రెడీ అవుతున్నాయి. క ఫేమ్ సుజీత్ సందీప్ ద్వయంతో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. ఈ మధ్యే వచ్చిన లుక్ అదిరిపోయింది. ఇక థ్రిల్లర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన అడివి శేష్.. ట్రాక్ మార్చి లిటిల్ హార్ట్స్ ఫేమ్ సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఓ బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీ చేయబోతున్నారు. యాక్షన్ అండ్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గోపీచంద్ తన పంథా మార్చి విభిన్న చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏకంగా 7వ శతాబ్దం నాటి పరిస్థితుల నేపథ్యంగా సాగే ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో గోపీచంద్ నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఆయన కెరీర్‌లో హైయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఇది. కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న శ్రీను వైట్లతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి పట్టున్న శర్వానంద్ జతకట్టడం పెద్ద సర్ ప్రైజే. విశ్వంలో అక్కడక్కడా తన మార్క్ కామెడీ చూపించిన వైట్ల.. శర్వానంద్‌తో కడుపులు చెక్కలయ్యే ఎంటర్‌టైనర్‌ తెరకెక్కిస్తానంటున్నారు. సంక్రాంతి 2027కి సిద్ధమవుతుంది ఈ చిత్రం. టాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ విజయ్ దేవరకొండ, హాయ్ నాన్న ఫేమ్ శౌర్యు ప్రాజెక్ట్. ఈ కాంబోలో హై ఎమోషనల్ ఎంటర్‌టైనర్ రానుందని తెలుస్తుంది. ఖుషీ తర్వాత విజయ్ చేయబోయే ఫ్యామిలీ సినిమా ఇదే. ఇలా మన హీరోలంతా తమ కంఫర్ట్ జోన్ దాటి ఎక్స్‌పెరిమెంటల్ కాంబినేషన్స్‌పై ఫోకస్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో పర్సెంటేజ్ యుద్ధం.. నిర్మాత-ఎగ్జిబిటర్ల మధ్య కొత్త వివాదం

Dhurandhar 2: అవుట్ స్టాండింగ్ అంటున్న సందీప్.. ఫిదా అయిపోయిన ప్రభాస్..

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్

మీ టైమ్ నడుస్తోంది.. నడిపించండి.. కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్

రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు..! సమస్యలతో వాయిదాలు

Follow Us