AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు..! సమస్యలతో వాయిదాలు

రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు..! సమస్యలతో వాయిదాలు

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 11, 2026 | 3:44 PM

Share

టాలీవుడ్‌లో భారీ చిత్రాలైన విశ్వంభర, స్వయంభు, నాగబంధం వంటి సినిమాలు VFX, గ్రాఫిక్స్ పనుల కారణంగా నిరంతరం వాయిదా పడుతున్నాయి. అనుకున్న సమయానికి విజువల్ ఎఫెక్ట్స్ పూర్తికాకపోవడంతో మేకర్స్ రిలీజ్ డేట్‌లను మార్చాల్సి వస్తుంది. ఇప్పటికే విడుదలైన చిత్రాలతో పాటు, రాబోయే భారీ ప్రాజెక్టులకు కూడా ఈ గ్రాఫిక్స్ సమస్యలు పెద్ద సవాలుగా మారాయి.

ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలకే కాదు.. రాబోయే భారీ చిత్రాలకు కూడా ఈ గ్రాఫిక్స్ కష్టాలు తప్పట్లేదు. సినిమా కోసం ఎంత టైమ్ కేటాయించినా VFX వర్క్ అనుకున్న సమయానికి పూర్తికాక రిలీజ్ డేట్లను మళ్లీ మళ్లీ ఛేంజ్ చేస్తూ.. వాయిదాలు వేస్తూనే ఉన్నారు మన మేకర్స్. విశ్వంభర నుంచి స్వయంభు వరకు గ్రాఫిక్స్ బేస్డ్ సినిమాలన్నింటిదీ అదే పరిస్థితి. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభరను గత ఏడాదిన్నరగా గ్రాఫిక్స్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఈ భారీ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ఇంకా సెట్ కాలేదు. దీనికంటే తర్వాత మొదలైన మన శంకరవరప్రసాద్ గారు వచ్చి ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసింది. నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ స్వయంభు సినిమాకు కూడా ఈ విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద తలనొప్పిగా మారాయి. గ్రాఫిక్స్ ఔట్ పుట్ సెట్ అవ్వకపోవడంతో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడ్డ స్వయంభు.. తాజాగా మరో డేట్ కోసం చూస్తుంది. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న నాగబంధం సినిమా గ్రాఫిక్స్ క్వాలిటీ కోసం కూడా మేకర్స్ చాలా కాలంగా నానా కష్టాలు పడుతున్నారు. పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో ముందుగా మేలో రిలీజ్ ప్లాన్ చేసినా.. జూలై 3కి ఈ సినిమాను వాయిదా వేశారు. మొత్తానికి గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్న సినిమాలన్నీ వాయిదాల బాటే పడుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే

Sundeep Reddy Vanga: స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా

Jana Nayagan: జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర

Follow Us