వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న గ్రాఫిక్స్ సినిమాలు తరచుగా వాయిదాలు పడుతూ, విడుదలైన తర్వాత నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్‌తో విమర్శలపాలవుతున్నాయి. ఆదిపురుష్, ఆచార్య వంటి చిత్రాలు దీనికి నిదర్శనం. దర్శక నిర్మాతలకు సరైన ప్రణాళిక, VFX పనితీరును అంచనా వేయడంలో లోపమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. క్వాలిటీ కోసం ఆలస్యం అంటారు కానీ, అంతిమంగా అవుట్‌పుట్‌లో అదే లోపిస్తుంది.
వందల కోట్లు బడ్జెట్‌తో వస్తున్న గ్రాఫిక్స్ బేస్డ్ సినిమాలు అనుకున్న టైమ్‌కి ఎందుకు రావట్లేదు.. దర్శక నిర్మాతలకు సరైన ప్లానింగ్ ఉండట్లేదా లేదంటే విజువల్ ఎఫెక్ట్స్ పనుల్ని ముందుగా అంచనా వేయలేకపోతున్నారా? అసలు గ్రాఫిక్స్ కీలకమైన ప్రతీ పెద్ద సినిమాకు అయితే విడుదలయ్యాక విమర్శలు.. విడుదలకు ముందు వాయిదాల ఇబ్బందులే ఎందుకొస్తున్నాయి..? కళ్లు చెదిరే విజువల్స్ అంటారు కానీ పూర్ గ్రాఫిక్స్ కారణంగా విడుదలైన తర్వాత భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్, రాజా సాబ్ లాంటి సినిమాలకు 400 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పినా.. ఫైనల్‌గా థియేటర్లలో ఆ విజువల్స్ రిజల్ట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆచార్య గ్రాఫిక్స్‌పై ఇలాంటి విమర్శలే వచ్చాయి. టెక్నాలజీ వాడటంలో ముందుండే శంకర్ లాంటి దర్శకుడు తీసిన గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా గ్రాఫిక్స్ మీద దారుణమైన కామెంట్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శంకర్ లాంటి విజనరీ మేకర్ నుంచి ఇలాంటి నాసిరకం విజువల్స్ ఊహించలేదెవ్వరు. ఇక పవన్ కళ్యాణ్ పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కచ్చితమైన విజన్, పక్కా ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి వందల కోట్ల సినిమాలు నాసిరకం ఔట్ పుట్‌తో విమర్శల పాలవుతున్నాయనేది కాదనలేని వాస్తవం. ఎప్పుడు అడిగినా క్వాలిటీ కోసమే వాయిదా అంటారు కానీ ఆ క్వాలిటీ విడుదలైన తర్వాత సినిమాలో కనిపించకపోవడమే అసలు మ్యాజిక్. మరి లోపం ఎక్కడుందో మన దర్శక నిర్మాతలకే తెలియాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sundeep Reddy Vanga: స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
Jana Nayagan: జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

