AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 11, 2026 | 4:12 PM

Share

ఒకప్పుడు అన్ సీజన్‌గా భావించిన డిసెంబర్ ఇప్పుడు బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పాన్ ఇండియా సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తూ, ఈ నెలను అత్యంత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. పుష్ప 2, యానిమల్, సలార్ వంటి చిత్రాలు గతంలో సంచలనం సృష్టించగా, 2026 డిసెంబర్‌లో విజయ్ దేవరకొండ, షారుక్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి, బాక్సాఫీస్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.

ఒకప్పుడు డిసెంబర్ అంటే అన్ సీజన్.. అప్పుడు సినిమాలు విడుదల చేసుకోడానికే భయపడేవాళ్లు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా డిసెంబర్ అంటే కేరాఫ్ బ్లాక్‌బస్టర్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ప్యాన్ ఇండియన్ మూవీస్ పంబ రేగ్గొడుతున్నాయి. వందల కోట్లు వసూలు చేస్తూ.. మోస్ట్ అవైటెడ్ మంత్‌గా మారిపోతుంది. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతుందో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? డిసెంబర్ బాక్సాఫీస్‌కు పూనకాలు తెప్పిస్తుంది.. ఏడాదితో పనిలేదు.. కొన్నేళ్లుగా డిసెంబర్‌లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా ఉండట్లేదు. ఆ మధ్య ధురంధర్ సైతం 2025 డిసెంబర్ 5న విడుదలై.. 1400 కోట్లు వసూలు చేసింది.. దానికి ముందు 2024 డిసెంబర్ పుష్ప 2 ఖాతాలోకి వెళ్లిపోయింది. 2024 డిసెంబర్ 4న విడుదలైన పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల వరకు వసూలు చేసింది. పుష్ప పార్ట్ 1 కూడా 2021 డిసెంబర్‌లో విడుదలైంది. ఇక 2023 డిసెంబర్ 1 వచ్చిన యానిమల్ ఏకంగా 900 కోట్ల వరకు వసూలు చేసింది. అదొక్కటే కాదు.. అదే నెలలో వచ్చిన ప్రభాస్ సలార్ సైతం 650 కోట్లు కొల్లగొట్టింది. టాలీవుడ్‌కు సైతం డిసెంబర్ బాగానే కలిసొస్తుంది. కరోనాతో థియేటర్లు మూతపడిన వేళ అఖండ వచ్చి రప్ఫాడించింది ఇదే డిసెంబర్‌లోనే. అందుకే డిసెంబర్ అంటే అన్ సీజన్ కాదు.. అదిరిపోయే సీజన్. 2026 డిసెంబర్‌ కూడా ఇప్పట్నుంచే హౌజ్ ఫుల్ అయింది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన వచ్చేది 2026 డిసెంబర్‌లోనే..! ఆల్రెడీ షారుక్ ఖాన్ కింగ్ సినిమా డిసెంబర్ 24న లాక్ అయింది.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్ ఫౌజీ కూడా అదే సమయంలో రానుంది. 2023 డిసెంబర్‌లో సలార్, డంకీ ఒకేసారి విడుదలైతే.. సలార్ దెబ్బకి డంకీకి షాక్ తప్పలేదు. 2026లోనూ వార్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. మొత్తానికి డిసెంబర్ అంటే బాక్సాఫీస్‌కు పూనకాలే ఇప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ టైమ్ నడుస్తోంది.. నడిపించండి.. కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్

రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు..! సమస్యలతో వాయిదాలు

వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే

Sundeep Reddy Vanga: స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా

Jana Nayagan: జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర

Follow Us