AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 11, 2026 | 4:31 PM

Share

టాలీవుడ్‌లో 'నెం.1 హీరోయిన్' కుర్చీ చాలాకాలంగా ఖాళీగా ఉంది. ఒకప్పుడు అనుష్క, సమంత వంటివారు ఏళ్లపాటు టాప్‌లో ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని స్థిరంగా దక్కించుకునే స్టార్లెవరూ కనిపించడం లేదు. పూజా హెగ్డే, రష్మిక, శ్రీలీల వంటివారు కొంతకాలం మెరిసినా, నిలదొక్కుకోలేకపోయారు. సాయి పల్లవి బాలీవుడ్ వైపు మళ్లగా, జాన్వీ కపూర్ వంటి కొత్తతరం నటీమణులు రేసులో ఉన్నా, ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారో చూడాలి.

టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ కుర్చీ ఖాళీ అయిపోయి చాలా రోజులవుతోంది. ఆ ప్లేస్‌ను భర్తీ చేసేవాళ్లే కరువయ్యారిప్పుడు. ఒకప్పుడు కనీసం ఏడాదైనా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్స్ ఉండేవారు.. కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ ఎక్కడా కనిపించట్లేదు. అసలు ఆ నెంబర్ వన్ చైర్ రేసులో ఎవరున్నారు.. ఆ కుర్చీ ఎందుకు ఖాళీగా ఉందో ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం. పదేళ్ల కిందట అనుష్క, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు టాలీవుడ్‌ను ఏలారు.. ఒక్కొక్కరు కనీసం రెండు మూడేళ్లైనా టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత పూజా హెగ్డే, రష్మిక మందన్న తమ క్రేజ్‌తో రెండేళ్ల పాటు దుమ్ము దులిపేశారు. రీసెంట్‌గా శ్రీలీల ఏడాది పాటు ఇండస్ట్రీని ఊపేసినా.. ఆ తర్వాత మ్యాజిక్ కొనసాగలేదు. నెంబర్ వన్ రేసు కూడా డల్లుగానే సాగుతుందిప్పుడు. టాప్ హీరోయిన్ చైర్ అలాగే ఖాళీగా ఉండిపోయింది.. పైగా ఆ రేసులో పోటీ పడేవాళ్లు కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. మన దగ్గర మాస్ క్రేజ్ ఉన్న సాయి పల్లవి చూస్తేనేమో.. బాలీవుడ్ వైపు ఫోకస్ షిఫ్ట్ చేసి అక్కడ బిజీ అయిపోయారు. అమీర్ ఖాన్ కొడుకుతో ‘ఏక్ దిన్’ సినిమాతో పాటు, భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణ’లో సీతమ్మగా నటిస్తున్నారీమే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాలతో బిజీగా ఉన్న భామలే కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో రుక్మిణి వసంత్, కుర్ర హీరోలతో భాగ్యశ్రీ బోర్సే లాంటివాళ్లు సందడి చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ పెద్ది, దేవర 2 లాంటి సినిమాలతో రేసులోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు జాన్వీ కపూర్. వీళ్లంతా సీజన్‌లా వచ్చి వెళ్తున్నారు కానీ పాతుకుపోయే వాళ్లెవరూ కనిపించట్లేదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్తున్నారే తప్ప, నెంబర్ వన్ అనిపించుకునే రేంజ్‌లో ఏ ఒక్కరూ ఆ కుర్చీలో సెట్ అవ్వలేకపోతున్నారు. సమంత, తమన్నా, రష్మిక లాంటి వాళ్ళేమో సీనియర్స్ అయిపోయారు. మిగిలిన వాళ్లు అప్పుడప్పుడూ వస్తున్నారు.. మరి ఈ స్థానాన్ని దక్కించుకుని టాలీవుడ్‌ను మళ్లీ శాసించే ఆ స్టార్ హీరోయిన్ ఎవరవుతారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mega 158: చిరంజీవి తేల్చేసారు.. ముహూర్తం అప్పుడే

టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్.. అదిరిపోతున్న క్రేజ్

టాలీవుడ్‌లో పర్సెంటేజ్ యుద్ధం.. నిర్మాత-ఎగ్జిబిటర్ల మధ్య కొత్త వివాదం

Dhurandhar 2: అవుట్ స్టాండింగ్ అంటున్న సందీప్.. ఫిదా అయిపోయిన ప్రభాస్..

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్

Follow Us