4 April, 2026
Subhash
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. రేషన్ కార్డులపై కేంద్రం కీలక నిబంధనలు విధిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుండి అమలు చేస్తున్న సరికొత్త నిబంధనల గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఇక రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. మీ సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లి బయోమెట్రిక్ (వేలిముద్ర) వేయడం ద్వారా యాప్ ద్వారా కూడా కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.
కేవైసీ పూర్తి చేయకపోతే లబ్దిదారులకు రేషన్ సరుకులను ఇవ్వడం నిలిపివస్తున్నారు. అందుకే కేవైసీ లేని వారు తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం.
ఈ నెలలో రేషన్ కార్డు ఉన్న వారికి ఒకే సారి మూడు నెలల రేషన్ అందిస్తున్నారు. దీనివల్ల ప్రతి నెలా క్యూలలో నిలబడాల్సిన ఇబ్బంది తప్పుతుంది.
కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను (Income Tax) చెల్లిస్తుంటే వారికి కార్డు రద్దవుతుంది. అలాగే నాలుగు చక్రాల వాహనం (ట్రాక్టర్ మినహా) ఉంటే కూడా కార్డు రద్దు చేస్తున్నారు.
అంతేకాకుండా మీరు కనుక వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకోకపోతే ప్రభుత్వం మీ పేరును తొలగిస్తుంది. అందుకే ప్రతి నెల తీసుకోవడం మంచిది.