28 March, 2026
Subhash
మీరు కష్టపడి సంపాదించిన డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు మంచి రిటర్న్స్ రావాలనుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) మీకు ఒక గొప్ప అవకాశం.
మీరు ప్రతిరోజూ కేవలం రూ.333 ఆదా చేస్తే, నెలకు సుమారు రూ.10,000 అవుతుంది. ఈ మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ RDలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ నిధిని సృష్టించవచ్చు.
పోస్ట్ ఆఫీస్ RD కాలపరిమితి ప్రాథమికంగా 5 ఏళ్లు ఉంటుంది. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం 6.7% వడ్డీ రేటును (వార్షికంగా) అందిస్తోంది.
మీరు నెలకు రూ.10,000 చొప్పున 10 ఏళ్ల పాటు (అంటే 5 ఏళ్ల తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించి) పెట్టుబడి పెడితే మొత్తం రూ.12 లక్షలు అవుతుంది. వడ్డీతో కలిపి రూ.17,08,546.
18 ఏళ్లు పైబడిన ఏ భారతీయులు ఈ ఖాతా తెరవవచ్చు. ముగ్గురు వ్యక్తులు కలిసి 'జాయింట్ అకౌంట్' కూడా తీసుకోవచ్చు. మైనర్ల పేరు మీద తల్లిదండ్రులు ఖాతా ప్రారంభించవచ్చు.
భారీ మొత్తమే కానక్కర్లేదు. నెలకు కేవలం రూ.100తో కూడా ఈ పొదుపును మొదలుపెట్టవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
ఖాతా ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత మీ డిపాజిట్ పై 50% వరకు లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంటుందని గుర్తించుకోండి.
ప్రభుత్వ గ్యారెంటీ ఉన్న ఈ పథకంలో పెట్టుబడి పెట్టి మీ భవిష్యత్తుకు ఆర్థిక భరోసానివ్వండి. మరిన్ని వివరాల కోసం మీ దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించండి.