27 March, 2026
Subhash
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో 10 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.13గా ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రభుత్వ నిర్ణయంతో రూ.3కు చేరుకుంది. డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా తొలగిపోయింది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుంకాలను తగ్గించిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో వాహనదారులకు ఇది ఉపశమనమే.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 106.33 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 93.5 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇటీవల ఇరాన్‌పై దాడులకు 5 రోజుల విరామం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ గడువును మరో 10 రోజులకు పొడిగించారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తీస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వాహనదారులకు ఎంతో ఊరటనిస్తుందనే చెప్పాలి.