17 February, 2026
Subhash
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 2.5 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు తెలిపింది.
చనిపోయిన వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తున్నామని, ఇప్పటి వరకు 2.5 కోట్లకుపైగా కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు కేంద్ర మంత్రి జితి లోక్‌సభలో వెల్లడించారు.
ఆధార్ డేటాబేస్ కచ్చితత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు ఆధార్ ప్రక్షాళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా చనిపోయిన వారి కార్డులన్నింటిని రద్దు చేస్తున్నట్లు వివరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా ఆధార్ రికార్డ్ సాధించింది. దాదాపు 134 కోట్ల మంది ఆధార్ కార్డులను కలిగి ఉన్నారు.
చనిపోయిన వారి ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేసి సంక్షేమ పథకాలను పొందుతున్నారని, ఇతర మోసాలకు వారి కార్డులను ఉపయోగిస్తున్నారని గుర్తించించింది కేంద్రం.
ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలను నిరోధించేందుకు ఆయా ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ ప్రక్రియ చాలా అవసరమని కేంద్ర మంత్రి తెలిపారు.
అలాగే ఆధార్ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఆధార్ బయోమెట్రిక్ లాక్, కొత్త ఆధార్ యాప్ వంటివి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.
ఆధార్ నంబర్ దుర్వినియోగాన్ని తగ్గించేందుకు UIDAI ఇప్పటికే చాలా రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.