పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ముంబైలో పండ్ల కల్తీ తీవ్ర కలకలం రేపింది. ఎలుకల మందు పూసిన పండ్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు. ప్రాణాంతక 'రాటోల్' అనే రసాయనం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు, అవయవాల వైఫల్యం, మరణం కూడా సంభవించవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విస్తృతంగా జరుగుతున్న ఈ ఆహార కల్తీపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పండ్ల కొనుగోలులో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
కల్తీ భూతం భయపెడుతోంది. తాగే పాల దగ్గర్నుంచి కృత్రిమంగా మాగబెట్టే మావిడి పండ్ల వరకు ప్రతీదీ కల్తీమయం అవుతోంది. బయట కొని తినాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి. ముంబైలో పండ్ల వ్యాపారులు పండ్లపై ఎలుకల మందు పూసి షాకిచ్చారు. బుధవారం ఒక స్థానికుడు ఈ ఘటన వీడియో తీసి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో జనం షాకయ్యారు. ముంబైలోని మలాడ్ వెస్ట్ లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇద్దరు పండ్ల వ్యాపారుల నిర్వాకం కలకలం రేపింది. అమ్మకానికి ఉంచిన పండ్లపై ఎలుకల మందు పూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు. నిందితులను మనోజ్ , రాహుల్ గా గుర్తించారు. రోడ్డు పక్కన ఉన్న వారి స్టాల్‌ను తనిఖీ చేసిన అధికారులు.. అక్కడ అత్యంత విషపూరితమైన ‘రాటోల్’ అనే ఎలుకల మందును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పసుపు భాస్వరం వంటి ప్రాణాంతక రసాయనాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే కారణం చెప్పారు. రాత్రిపూట ఎలుకలు తమ పండ్లను పాడు చేయకుండా ఉండేందుకే తాము ఇలా మందు పూసినట్లు వారు అంగీకరించారు. అయితే, ఆహార పదార్థాలపై ఇటువంటి విషపూరిత రసాయనాలు వాడటం వల్ల వాంతులు, కడుపునొప్పి, అవయవాల వైఫల్యం సహా ప్రాణాపాయం కూడా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఎఫ్ డీఏ అధికారులు వీధి వ్యాపారులపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రజలు వీడియోను షేర్ చేస్తూ ఇతరులని అలర్ట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
మహేష్ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్
తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!
KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్’ కు.. అనుకూలంగా తీర్పు
Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

