తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!
మీనా, వినీత్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రోస్లిన్' ఫిబ్రవరి 27న జియో హాట్‌స్టార్‌లో విడుదలయ్యింది. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి. 17 ఏళ్ల రోస్లిన్ పీడకలలు, గ్రీన్ ఐడ్ స్ట్రేంజర్ కథాంశంగా, మల్టీలాంగ్వేజెస్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సిరీస్ రోస్లిన్. సుమేష్ నందకుమార్ దర్శకుడు. ‘దృశ్యం’ మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ దీనికి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్యలో రోస్లిన్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27న జియో హాట్ స్టార్ లో స్ట్రీమి అవుతోంది. తెలుగు తమిళ్.. మలయాళం, కన్నడ భాషల్లోనే కాదు.. మరాఠీ, బెంగాళీ భాషల్లో కూడా ఈ సిరీస్ ఇప్పుడు అందుబాటులో ఉంది. రోస్లిన్ అనే 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమెకు పదే పదే ఒకే రకమైన పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఆకుపచ్చ కళ్లు ఉన్న ఒక అపరిచితుడు ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి భయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు మీనా, వినీత్ అది కేవలం భ్రమ అని కొట్టిపారేస్తారు. అయితే, ఆ కలల్లో చూసిన వ్యక్తే ఒకరోజు వారి ఇంటికి అతిథిగా రావడం కథలో అసలైన మలుపు. అయితే నేరుగా రోస్లిన్ ఇంటికి వచ్చిన ఆ అపరిచితుడి అసలు ఉద్దేశం ఏమిటి? రోస్లిన్ తన భ్రమల నుంచి బయటపడి ఆ నిజాన్ని ఎలా నిరూపించింది అనేదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రిమైనింగ్ స్టోరీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్’ కు.. అనుకూలంగా తీర్పు
Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో
Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

