బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు
బొద్దుగా, ముద్దుగా కనిపించిన మన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు సన్నజాజి తీగల్లా మారి సరికొత్త లుక్‌తో మెరిసిపోతున్నారు. మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్, రాశీ ఖన్నా, శ్రీలీల, నయనతార, సమంత వంటి తారలు బరువు తగ్గి "చక్కనమ్మ చిక్కినా అందమే" అని నిరూపిస్తున్నారు. పాత్ర డిమాండ్, వ్యక్తిగత ప్రాధాన్యతల మేరకు ఈ మేకోవర్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.
చక్కనమ్మా చిక్కినా అందమే అన్న సామెతను మన స్టార్ హీరోయిన్లు అక్షరాలా నిజం చేస్తున్నారిప్పుడు. నిన్నమొన్నటి వరకు కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించిన భామలంతా.. ఇప్పుడు సన్నజాజి తీగల్లా మారిపోయారు. మరి ఇలా స్లిమ్ లుక్‌లో మెరిసిపోతున్న మెరుపుతీగలెవరు.. వాళ్లు చేస్తున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి..? అవన్నీ చూద్దామా..? మేకోవర్‌పై మృణాళ్ ఠాకూర్ ఫోకస్ చేసారు. మొన్నటివరకు కాస్త లావుగా కనిపించిన ఈ బ్యూటీ.. సన్నగా మెరుపుతీగలా మారిపోయారిప్పుడు. ప్రస్తుతం నటిస్తున్న డెకాయిట్‌లోనూ మెరుపుతీగలా కనిపిస్తున్నారు. హిందీలోనూ మృణాళ్ సన్నగా బరువు తగ్గిపోయి కనిపించారు. అలాగే కీర్తి సురేష్ కూడా తన పెళ్లి తర్వాత మరింత స్లిమ్‌గా తయారై సరికొత్త గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రాశీ ఖన్నా కూడా మునుపటి కంటే చాలా సన్నగా, స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మేకింగ్ స్టిల్స్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. అదే సినిమాలో నటిస్తున్న శ్రీలీల సైతం బాగా బరువు తగ్గి నాజూగ్గా మారిపోయారు. శ్రీలీల రీసెంట్ లుక్స్ చూస్తుంటే.. మునపటితో పోలిస్తే తగ్గిపోయారనే విషయం కనిపిస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం శంకవరప్రసాద్ గారు సినిమాలో చాలా సన్నగా కనిపించారు. పాత్ర డిమాండ్ మేరకు బరువు తగ్గుతూ ఈ ముద్దుగుమ్మలంతా తమ డెడికేషన్ చూపిస్తున్నారు. సమంత మరింత నాజూగ్గా మారిపోయారు ఈ మధ్య. అందుకే అనేది చక్కనమ్మ చిక్కినా అందమే అని..! మొత్తానికి బొద్దుదనం వదిలేసి స్లిమ్ అండ్ ఫిట్ అవతార్‌లోకి మారిపోతున్నారు ఈ స్టార్ హీరోయిన్లు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి
8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే
Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్
Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని
Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

