KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్’ కు.. అనుకూలంగా తీర్పు
ప్రముఖ నటుడు కమల్ హాసన్ పర్సనాలిటీ హక్కులను మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఆయన అనుమతి లేకుండా ఫోటోలు, డైలాగులు, బిరుదులను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించిన ఓ దుస్తుల కంపెనీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కమల్ గుర్తింపును దుర్వినియోగం చేయకుండా 'జాన్ డో' ఆర్డర్ కూడా ఇచ్చింది. అయితే వ్యంగ్య చిత్రాలు, సృజనాత్మక కళారూపాలకు ఈ నిషేధం వర్తించదు.
బాలీవుడ్ .. టాలీవుడ్ స్టార్స్‌కు మళ్లే.. లోక నాయకుడు కమల్ హాసన్ కూడా తన పర్సనాలిటీ రైట్స్ ను రక్షించాలంటూ ఇటీవల మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా జరిగిన విచారణలో ప్రతివాదులు హాజరు కాకపోవడంతో… కమల్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది మద్రాసు హైకోర్టు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఇటీవల చెన్నైకి చెందిన ఓ దుస్తుల కంపెనీ కమల్ హాసన్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలతో తమ బట్టల బ్రాండ్‌ను ప్రచారం చేసుకుంది. కమల్ హాసన్ ఉలగనాయగన్ బిరుదులో.. ఆయన సినిమాల్లోని ఫేమస్ డైలాగులతో టీషర్టులను డిజైన్ చేసి సేల్ చేసింది. ఇక ఇది కమల్ టీం దృష్టికి రావడంతో.. ఆయన తీవ్రంగా స్పందించారు. తన పర్సనాలిటీ రైట్స్‌ను రక్షించాలంటూ.. మద్రాసు హైకోర్టును అభ్యర్థించారు. జనవరి 12న కమల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. సదరు చెన్నై బేస్ట్ దుస్తుల కంపెనీ పై తీవ్రంగా రియాక్టైంది. కమల్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, ఐకానిక్ డైలాగులు లేదా ఆయనను పోలిన చిత్రాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడటంపై నిషేదిస్తున్నట్టు.. మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాదు ఈ కేసులో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థలు కూడా ఆయన గుర్తింపును దుర్వినియోగం చేయకుండా ఉండేలా కోర్టు ‘జాన్ డో’ ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం వాణిజ్యపరమైన దోపిడీకి మాత్రమే వర్తిస్తాయని.. కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు, సృజనాత్మక కళా రూపాలకు ఈ నిషేధం వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో
Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే
బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

