AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

Phani CH
|

Updated on: Feb 28, 2026 | 9:11 PM

Share

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-3 CBT పరీక్ష తేదీలను సవరించింది. మార్చి 5-9 మధ్య జరగాల్సిన పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో మూడు షిఫ్టుల్లో జరుగుతాయి. పరీక్ష నగర కేటాయింపు 10 రోజుల ముందు, హాల్‌టికెట్‌ 4 రోజుల ముందు విడుదల చేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం గమనించాలని RRB సూచించింది.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు..టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది. టెక్నీషియన్ గ్రేడ్-1 , టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీలను సవరిస్తూ బోర్డు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. గతంలో జనవరిలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 5 నుండి 9 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాటిని మార్చారు. తాజా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్‌..ఉదయం 9:00 నుండి 10:30 వరకు జరుగుతుంది. రెండో షిఫ్ట్: మధ్యాహ్నం 12:45 నుండి 2:15 వరకు. మూడో షిఫ్ట్: సాయంత్రం 4:30 నుండి 6:00 వరకు జరుగుతుంది. పరీక్షకు 10 రోజుల ముందుగానే అభ్యర్థులు తమకు కేటాయించిన నగరాన్ని వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. హాల్‌ టికెట్‌ పరీక్ష తేదీకి సరిగ్గా 4 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఇందులో పరీక్షా కేంద్రం, షిఫ్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా మొత్తం 6,238 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాత పరీక్ష, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలని ఆర్‌ఆర్‌బీ సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు

Gold & Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే

18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ

పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు

Follow Us