18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
చైనాలో ఏడేళ్ల టాంగ్‌డౌ స్కిప్పింగ్‌తో బరువు తగ్గించుకునే ప్రయత్నం వైరల్ అయ్యింది. అతని తండ్రి సలహాతో ప్రారంభించిన ఈ ప్రయాణం, మిలియన్ల కొద్దీ లైక్‌లు పొందింది. ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలకు స్కిప్పింగ్ ఒక గొప్ప పరిష్కారం. ఇది కేలరీలను తగ్గిస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. టాంగ్‌డౌ కథ పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించే కొత్త పేరెంటింగ్ ట్రెండ్‌గా మారింది.
చైనాలో ఏడేళ్ల బాలుడు టాంగ్‌డౌ తన బరువు తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వయస్సుకు మించి బరువు పెరిగిన టాంగ్‌డౌకు అతని తండ్రి స్కిప్పింగ్ చేయమని సలహా ఇచ్చాడు. తండ్రి వీడియో తీస్తుండగా..‘సమ్మర్ హాలిడేస్‌లో నువ్వు చెప్పినట్లే చేస్తాను నాన్న’ అని మాట ఇచ్చాడు బాలుడు. అంతేకాదు…‘నువ్వు పోస్టు చేసే వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే, అన్ని సార్లు స్కిప్పింగ్ చేస్తా’ అని సరదాగా చెప్పాడు. చెప్పినట్లుగానే ఆ తండ్రి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తొలి రోజు ఆ వీడియోకి 150 లైక్స్ వచ్చాయి. లైక్స్‌కు అనుగుణంగానే బాలుడు స్కిప్పింగ్ చేశాడు. రోజులు గడిచేకొద్దీ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ప్రస్తుతం వీడియోకు 18 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో బాలుడు నిజంగా 18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా? అని చైనా సోషల్ మీడియాలో చర్చించుకునేదాకా వెళ్లింది. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న దేశాల్లో చైనా ఒకటి. పెద్దల్లో 35 శాతం, పిల్లల్లో 12 శాతం మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. టాంగ్‌డౌ వీడియో చైనాలో పేరెంటింగ్ ట్రెండ్‌గా మారింది. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తల్లితండ్రులు కొత్త పద్ధతులను ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అధిక బరువుతో బాధపడేవారికి స్కిప్పింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజూ స్కిప్పింగ్ చేస్తే.. శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగిపోయి సన్నగా అవుతారు. ప్రతిరోజూ ఓ గంటపాటు తాడాట ఆడితే.. 1300 క్యాలరీలు ఖర్చవుతాయట. . వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి స్కిప్పింగ్ మంచి రిజల్ట్స్ ఇస్తుందంటున్నారు నిపుణులు. ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం ఒక మైలు పరిగెత్తిన దాంతో సమానమని అంటున్నారు. ఈ రోజుల్లో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఒత్తిడి, ఆందోళనతో చాలా మంది బాధపడుతున్నారు. స్కిప్పింగ్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి ఒత్తిడి దూరం అవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
మహేష్ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం
నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..

