AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (March 1, 2026): మేష రాశి వారికి వాహన యోగానికి అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అయితే అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 01 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 01, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 1, 2026): మేష రాశి వారికి వాహన యోగానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది. అయితే పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాభవం పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగం విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రయాణాలు వల్ల లాభాలు పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి. స్థిరాస్తికి సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన యోగానికి అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి సూచనలున్నాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అయితే అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగాఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవ హారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మీ వల్ల బంధుమిత్రులు కొందరు ప్రయోజనం పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయపరంగా పైచేయి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగం విషయంలో శుభవార్త అందుతుంది. కొద్ది ప్రయప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతాయి. ముఖ్యమైన లావాదేవీలు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక ప్రయత్నాలకు ఎదురుండదు. ఆరోగ్యం హ్యాపీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. అధికార వర్గాల నమ్మకాన్ని చూరగొంటారు. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. కొందరు బంధువులు, సన్నిహితులతో ఏర్పడ్డ వివాదాలు తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. మిత్రుల మీద అనవసర ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు కూడా లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో బంధుమిత్రులను గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిప్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. అనుకోకుండా బంధువర్గం నుంచి పెళ్లి సంబంధానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రులతో అపార్థాలు ఏర్పడే సూచనలున్నాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో బాగా మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తలపెట్టిన పనుల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, నిదానంగా వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన శుభవార్త అందు తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాలు ఎటువంటి సమస్యలూ లేకుండా ముందుకు సాగిపోతాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొత్త ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సజావుగానే సాగిపోతాయి. వ్యాపారాలలో ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. చేయని పనికి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

Follow Us